Breaking News

హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ విషయాలు తెలుసుకోకపోతే జేబుకు చిల్లే!

Published on Sat, 09/19/2026 - 17:57

ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరంగా మారింది. అనారోగ్య సమస్యలు, ఆసుపత్రి ఖర్చులు ఎప్పుడు ఎదురవుతాయో చెప్పలేని పరిస్థితుల్లో ఆరోగ్య బీమా ఆర్థికంగా కొంత భరోసా ఇస్తుంది. అయితే పాలసీ తీసుకునే సమయంలో కేవలం ప్రీమియం ఎంత? అనే విషయాన్ని మాత్రమే కాకుండా.. పాలసీలో ఉన్న కొన్ని ముఖ్యమైన నిబంధనలను కూడా పరిశీలించాలి. నిపుణుల సూచనల ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు ఇవే..

కో-పేమెంట్ ఉందా? లేదా?
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు కో-పేమెంట్ నిబంధన ఉందా లేదా అనేది తప్పకుండా చెక్ చేయాలి. కొన్ని పాలసీల్లో చికిత్స ఖర్చులో 10 శాతం, 15 శాతం లేదా నిర్ణయించిన కొంత మొత్తాన్ని పాలసీదారుడే చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే కో-పేమెంట్ అంటారు. కొన్ని బీమా సంస్థలు జీరో కో-పేమెంట్ ఆప్షన్‌ను కూడా అందిస్తున్నాయి. కాబట్టి పాలసీ తీసుకునే ముందు ఈ నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకోవడం ముఖ్యం.

రూమ్ రెంట్‌పై పరిమితి ఉందా?
పాలసీలో రూమ్ రెంట్ క్యాపింగ్ ఉందా లేదా అనేది కూడా పరిశీలించాలి. కొన్ని పాలసీల్లో రోజువారీ గది అద్దెకు పరిమితి ఉంటుంది. ఉదాహరణకు పాలసీలో రోజుకు రూ.5,000 వరకు మాత్రమే రూమ్ రెంట్ కవర్ చేస్తే.. అంతకంటే ఎక్కువ ఖర్చయ్యే గదిని ఎంచుకున్నప్పుడు అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంటుంది. అందుకే వీలైతే నో రూమ్ రెంట్ క్యాపింగ్ ఉన్న పాలసీని పరిశీలించడం ఉపయోగకరంగా ఉంటుంది.

మోడ్రన్ ట్రీట్‌మెంట్స్ కవరేజ్
వైద్య రంగంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. రోబోటిక్ సర్జరీలు, ఆధునిక చికిత్సా విధానాలు వంటి వాటి వినియోగం కూడా పెరుగుతోంది. అందువల్ల పాలసీలో మోడ్రన్ ట్రీట్‌మెంట్స్‌కు కవరేజ్ ఉందా లేదా అనేది ముందుగానే తెలుసుకోవాలి. పాలసీలో ఈ కవరేజ్ లేకపోతే.. ఆధునిక చికిత్సలు చేయించుకున్న సమయంలో వాటి ఖర్చులో కొంత భాగాన్ని మనమే భరించాల్సి రావచ్చు.

వెయిటింగ్ పీరియడ్ ఎంత?
పాలసీ తీసుకునే ముందు వెయిటింగ్ పీరియడ్‌ను కూడా తప్పకుండా పరిశీలించాలి. ముఖ్యంగా ముందుగా ఉన్న అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ నిబంధన చాలా ముఖ్యమైనది.

కొన్ని పాలసీల్లో నిర్దిష్ట వ్యాధులకు కవరేజ్ లభించడానికి కొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి వివిధ పాలసీల వెయిటింగ్ పీరియడ్‌ను పోల్చి చూసి, నిబంధనలు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలి.

ఏ ఆసుపత్రుల్లో కవరేజ్ ఉంది?
మీరు తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఏయే ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్సకు అవకాశం కల్పిస్తుందో కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా మీ ఇంటికి సమీపంలో ఉన్న ప్రముఖ ఆసుపత్రులు పాలసీ నెట్‌వర్క్‌లో ఉన్నాయా లేదా అనేది ముందుగానే చెక్ చేసుకోవడం మంచిది.

క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో
బీమా సంస్థను ఎంచుకునే సమయంలో క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు సంబంధించిన వివరాలను కూడా పరిశీలించాలి. అంటే పాలసీదారులు చేసిన క్లెయిమ్‌లలో ఎంత శాతం పరిష్కరించారో తెలుసుకోవాలి.

అయితే క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో ఒక్కటే ఆధారంగా కంపెనీని ఎంచుకోకుండా.. పాలసీ నిబంధనలు, కవరేజ్, మినహాయింపులు, క్లెయిమ్ ప్రక్రియ వంటి ఇతర అంశాలను కూడా పరిశీలించడం అవసరం.

కంపెనీపై ఫిర్యాదులు
పాలసీ తీసుకునే ముందు సంబంధిత బీమా సంస్థపై వచ్చిన ఫిర్యాదులు, కస్టమర్ల అనుభవాలు, క్లెయిమ్‌లకు సంబంధించిన సమస్యలు వంటి అంశాలను కూడా తెలుసుకోవడం మంచిది. ముఖ్యంగా క్లెయిమ్ సమయంలో కంపెనీ సేవలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ఈ వివరాలు ఉపయోగపడతాయి.

ఏజెంట్ ద్వారా తీసుకోవాలా?
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని నేరుగా ఆన్‌లైన్‌లో తీసుకోవడం లేదా ఏజెంట్ ద్వారా తీసుకోవడం అనేది వ్యక్తిగత నిర్ణయం. అయితే.. ఏ మార్గంలో తీసుకున్నా పాలసీ డాక్యుమెంట్‌లోని నిబంధనలు, మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్, కవరేజ్ వంటి వివరాలను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి.

ఏజెంట్ ద్వారా పాలసీ తీసుకుంటే.. భవిష్యత్తులో పాలసీకి సంబంధించిన సందేహాలు లేదా క్లెయిమ్ ప్రక్రియలో సహాయం అవసరమైనప్పుడు సంప్రదించడానికి ఒక వ్యక్తి ఉండే అవకాశం ఉంటుంది.

Videos

నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై

టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు

రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్?

తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు..

గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆరోపణలపై ప్రసన్న ఫైర్

చంద్రబాబుకు బిగ్ షాక్.. తిరుమల లడ్డూపై ఈడీ సంచలన ప్రకటన

పద్థతి మార్చుకో.. MLAపై రెచ్చిపోయిన చంద్రబాబు

నిండా ముంచేసిన లలితా జువెల్లరీ స్టాక్.. అసలేం జరిగిందంటే?

అమలాపురంలో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం

Photos

+5

హాఫ్ శారీలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు)

+5

నాని ది ప్యారడైజ్ స్టైలిష్ లుక్‌.. (ఫోటోలు)

+5

గణేశుడి సన్నిధిలో విజయ్‌ దేవరకొండ..(ఫోటోలు)

+5

అందాల అషు.. (ఫోటోలు)

+5

కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు)

+5

ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు)

+5

గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు)

+5

తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు)