Breaking News

పాల ధరల పెంపు.. 35 శాతం పెరిగిన బస్సు ఛార్జీలు!

Published on Thu, 11/05/2026 - 10:13

కర్ణాటకలో ఇటీవల పాల ధరల పెంపు నిర్ణయం వెలువడిన కొంత సమయానికే రవాణా రంగంపై మరో భారం పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచుతూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 5 నుంచి ఈ కొత్త ఛార్జీలు అధికారికంగా అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలోని రోడ్డు రవాణా సంస్థల పరిధిలో ప్రయాణ రుసుములు 35 శాతం వరకు పెరగడం ప్రయాణికులను నిరాశకు గురిచేస్తోంది. కాగా, ఇటీవల సాధారణ టోన్డ్ పాలు ధర ఇదివరకు లీటరుకు రూ.46 ఉండగా రూ.54కి పెంచారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత మూడేళ్ల కాలంలో బస్సు ఛార్జీలు పెరగడం ఇది రెండోసారి. ప్రస్తుత సవరణ ప్రకారం.. కర్ణాటక స్టేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (కేఎస్‌ఆర్‌టీసీ) బస్సుల్లో సగటున 23 శాతం వరకు ఛార్జీలు పెరగగా, బెంగళూరు నగర రవాణా సంస్థ (బీఎంటీసీ) సిటీ బస్సుల్లో ఈ పెరుగుదల ఏకంగా 33 నుంచి 35 శాతం వరకు ఉంది.

డీజిల్ ధరలే కారణం

ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నప్పటికీ రవాణా శాఖ వర్గాలు మాత్రం సంస్థల మనుగడ కోసం ఈ నిర్ణయం తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నాయి. డీజిల్ ధరలు విపరీతంగా పెరగడం, నిర్వహణ వ్యయం భారంగా మారడంతో ఆర్టీసీ సంస్థలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని అధికారులు వెల్లడించారు. ‘ఆర్టీసీ సంస్థలను లాభాల ఆర్జన కోసం కాకుండా వాటిని కాపాడుకోవడానికి మాత్రమే ఈ ఛార్జీల పెంపు చేపట్టాం’ అని ప్రభుత్వ వర్గాలు సమర్థించుకుంటున్నాయి.

ప్రయాణికులపై భారం ఇలా..

బీఎంటీసీ సిటీ బస్సుల్లో ప్రయాణించే వారికి మెజెస్టిక్ నుంచి శివాజీనగర్ వెళ్లేందుకు గతంలో రూ.12 ఉండగా, అది ఇప్పుడు రూ.18కి చేరింది. అలాగే మెజెస్టిక్ - యశ్వంత్‌పూర్ రూట్ ఛార్జీ రూ.18 నుంచి రూ.25కి పెరిగింది. వజ్ర ఏసీ బస్సుల గరిష్ట ఛార్జీని రూ.75 నుంచి రూ.90కి, ఎయిర్‌పోర్ట్ ‘వాయు వజ్ర’ సర్వీసుల గరిష్ట ఛార్జీని రూ.405 నుంచి రూ.425కి సవరించారు. కేఎస్‌ఆర్టీసీ సర్వీసుల్లో దూర ప్రాంతాలకు వెళ్లే సాధారణ, రాజహంస బస్సుల ఛార్జీలు కూడా దూరానికి అనుగుణంగా పెరిగాయి. బెంగళూరు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అదనపు భారం తప్పడం లేదు.

మహిళలకు యథావిధిగానే..

అయితే, మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించే ‘శక్తి’ పథకం కింద నాన్-లగ్జరీ బస్సుల్లో కొనసాగుతున్న ఉచిత సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉచిత ప్రయాణ పథకం వల్ల రవాణా సంస్థలపై పడుతున్న ఆర్థిక భారాన్ని పూడ్చుకునేందుకే మిగతా ప్రయాణికులపై ఛార్జీల భారం మోపుతున్నారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నిత్యావసరాలు, పాలు, రవాణా ఛార్జీలు అన్నీ ఒకేసారి పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు బడ్జెట్ ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను నడిపించే ప్రభుత్వాలు ప్రయాణికులపై ఈ స్థాయిలో భారం మోపడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదీ చదవండి: డబ్బును దాచుకుంటే దరిద్రం!?

Videos

ఇలాంటి ఏలక్షన్ లు నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్...

కూటమి అరాచకాలపై వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్

నన్ను ఆపడానికి నువ్వు ఎవడివి? ఇచ్చిపడేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి

చెరువుగా మారిన శంద్రబాబు రాజధాని!

ఎన్నికల్లో ట్రంప్ కు భారీ దెబ్బ కుప్పకూలిన క్రూడాయిల్ ధరలు

దొంగ ఓటర్లను చితకబాదిన స్థానికులు.. వైరల్ అవుతున్న వీడియోలు

ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా..! అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బాబుకు YS జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

అంతా రామమయం..!

మెగాస్టార్ డబుల్ ధమాకా ఒకే నెలలో చిరు 2 సినిమాలు

Photos

+5

అందాల అనుపమ.. తాజా ఫొటోలు

+5

సింపుల్‌ లుక్స్‌లోనూ అదిపోయిన భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు)

+5

రేపే ‘సీన్‌’ రిలీజ్‌.. నజ్రీయా నజీమ్‌ ఫొటోలు వైరల్‌

+5

నగలతో నిండైన అందం.. కంగనా ట్రెడిషనల్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

గోల్డెన్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)

+5

38వ బర్త్‌డే.. విరాట్‌ కోహ్లి ఫొటోలు వైరల్‌

+5

వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)

+5

మురసు తుపాను బీభత్సం...భారీ వర్షానికి నీట మునిగిన రాజమండ్రి (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో అట్టహాసంగా సదర్‌ సమ్మేళనం (ఫోటోలు)

+5

టిప్ టాప్‌గా రెడీ అయిన మెగా డాటర్ నిహారిక (ఫొటోలు)