పేలిన గోల్డ్ బబుల్.. లీ మాటలు నిజమవుతున్నాయా?

Published on Sat, 01/31/2026 - 15:58

బంగారం, వెండి ధరలు తగ్గుతాయి.. తొందరపడి కొనుగోలు చేయకండి అని గ్లోబల్ ఎకనామిక్ అడ్వైజర్స్ చీఫ్ ఎకనామిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'విలియం లీ' హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఆయన మాటలు నిజయమయ్యాయా అనిపిస్తోంది.

గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో రేట్లు భారీగా తగ్గిపోయాయి. ధరల తగ్గుదల అటు పెట్టుబడిదారుల్లో.. వ్యాపారుల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది. పసిడి ధరల పెరుగుదలను లీ.. నీటి బుడగ(బబుల్)తో పోల్చారు. ఈ బుడగ ఎప్పుడైనా పగిలిపోయే అవకాశం ఉందన్నారు. ఆ గోల్డ్ బబుల్ ఇప్పుడు పేలిపోయింది.

జనవరి 30న బంగారం ధర దాదాపు 9 శాతం తగ్గిపోయి రూ. 1.67 లక్షలకు (10 గ్రాములు) చేరింది. వెండి కూడా రెండు రోజుల్లో కేజీ ధర రూ. 75వేలు తగ్గింది. దీంతో సిల్వర్ రేటు 3.50 లక్షలకు చేరింది. ఈ ధర ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

వైట్ ఓక్ క్యాపిటల్ ప్రకారం.. బంగారం & వెండి ధరలను భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవస్థలోని వ్యవస్థాగత ప్రమాదాలు & కరెన్సీపై ఒత్తిడి వంటివి ప్రభావం చూపుతాయి. నిజానికి వెండి.. బంగారం నిష్పత్తి 80:1గా ఉండేది. కొన్నాళ్లుగా పెరిగిన ధరలు ఈ నిష్పత్తిని 46:1కి చేర్చింది. దీన్నిబట్టి వెండి ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడం ఇదే మొదటిసారి కాదు. 2011 ఏప్రిల్‌లో కేజీ వెండి ధర రూ.73,288 వద్దకు చేరి, ఆ తరువాత 55 శాతం పడిపోయింది. తిరిగి ఆ స్థాయి నుంచి కోలుకోవడానికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది. అదే విధంగా.. 2012 సెప్టెంబర్‌లో బంగారం 10 గ్రాములకు రూ.32,147 వద్ద గరిష్టాన్ని తాకి, 25 శాతం పడిపోయింది. మళ్ళీ మునుపటి స్థాయికి చేరుకోవడానికి ఏడు సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ అవుతుందా? అని చాలామంది అనుకుంటున్నారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)