Breaking News

కొత్త బడ్జెట్‌కు ముందు కీలక డాక్యుమెంట్‌

Published on Thu, 12/26/2024 - 09:23

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ (Finance Minister Nirmala Sitharaman ) ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో 2025–26 వార్షిక బడ్జెట్‌ను (Budget 2025) ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థికశాఖ (Finance Ministry) కీలక డాక్యుమెంటును  ఆవిష్కరించింది. బడ్జెట్‌ లక్ష్యాలను ఈ డాక్యుమెంట్‌లో సూచించింది. 4.5 శాతం వద్ద ద్రవ్యలోటు ( fiscal deficit) కట్టడి, పేదల అవసరాలకు అనుగుణంగా సామాజిక భద్రతా చర్యలకు పెద్దపీట వేయడం.. ఇందులో కీలక అంశాలుగా ఉన్నాయి.

వచ్చే రెండేళ్లు భారత్‌ వృద్ధి 6.5 శాతం 
భారత్‌ ఆర్థిక వ్యవస్థ  ప్రస్తుత (2024–25)  వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.5 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని సేవల దిగ్గజ సంస్థ– ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈవై) నివేదిక పేర్కొంది. ప్రైవేట్‌ వినియోగ వ్యయం, అలాగే మూలధన వ్యయాలు అంచనాలకన్నా తగ్గడం వృద్ధికి బ్రేకులు వేస్తున్న అంశంగా ఈవై వివరించింది. ఈ కారణంగానే సెప్టెంబర్‌ త్రైమాసికంలో వృద్ధి రేటు ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయిలో 5.4 శాతంగా నమోదయ్యిందని విశ్లేషించింది.

ప్రపంచ పరిస్థితులు అనిశ్చితంగా ఉండటం, ప్రపంచ వాణిజ్య పరిస్థితుల వంటి అంశాల నేపథ్యంలో దేశీయ డిమాండ్, సేవల ఎగుమతులపై  భారత్‌ ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుందని ఈవై పేర్కొంది.  రోడ్లు, స్మార్ట్‌ సిటీలు, రైల్వేలు, విద్యుత్,  పునరుత్పాదక ఇంధనంసహా ప్రాధాన్యతా రంగాల పురోగతికి 2030 వరకు వర్తించే తాజా నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఐపీ) ఆవిష్కరణ అవసరమని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం అప్పులు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 60 శాతానికి మించకూడదని పేర్కొన్న ఈవై,  ఈ 60 శాతం భారం కేంద్రం, రాష్ట్రాలపై సమానంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)