Breaking News

బడ్జెట్‌ 2025-26: రియల్‌ ఎస్టేట్‌కు బూస్ట్‌!

Published on Sat, 02/01/2025 - 16:45

దేశంలో రియల్‌ఎస్టేట్‌ రంగానికి వైభవం తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది.
మధ్యతరగతి గృహ కొనుగోలుదారులకు స్థోమతను పెంచేలా రూ. 12 లక్షలు.. స్టాండర్డ్ డిడక్షన్‌లతో కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇది ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతుందని, హౌసింగ్ డిమాండ్, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను పెంచుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు.

"కొత్త పన్ను నిర్మాణం మధ్యతరగతి పన్నులను గణనీయంగా తగ్గిస్తుంది. వారి చేతుల్లో ఎక్కువ డబ్బు ఉండేలా చేస్తుంది. గృహ వినియోగం, పొదుపు, పెట్టుబడిని పెంచుతుంది" అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. రియల్‌ ఎస్టేట్‌కు తాజా బడ్జెట్‌లో ఎలాంటి నిర్ణయాలు ప్రకటించారో ఇప్పుడు చూద్దాం..

  • నిలిచిపోయిన ప్రాజెక్టుల్లో లక్ష ఇళ్లను పూర్తి చేసేందుకు స్వామి (SWAMIH ) ఫండ్-2ను ప్రభుత్వం ప్రకటించింది. 2025 బడ్జెట్‌లో అదనంగా లక్ష ఇళ్ల నిర్మాణం కోసం కొత్త స్వామి ఫండ్ 2కి రూ.15,000 కోట్ల కేటాయింపును ప్రకటిచింది. దీంతో చాలా కాలంగా ఆలస్యమవుతున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లలో ఇళ్లు కొనుగోలుచేసిన వేలాది మందికి  ఉపశమనం కలగనుంది.

  • స్వామి స్కీమ్ కింద ప్రస్తుతం ఉన్న 50,000 నివాస యూనిట్లు పూర్తికావడం, మరో 40,000 పైప్‌లైన్‌లో ఉండటం సంక్షోభాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వ గట్టి ప్రయత్నాన్ని తెలియజేస్తోందని నిపుణులు చెబుతున్నారు.

  • అద్దె ఆదాయంపై వార్షిక టీడీఎస్‌ పరిమితిని ప్రస్తుత రూ. 2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అద్దెపై వార్షిక టీడీఎస్‌ పరిమితిని రూ.2.40 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచడం వలన చిన్న పన్ను చెల్లింపుదారులు, భూస్వాములు కూడా గణనీయంగా ప్రయోజనం పొందుతారని రియల్‌ ఎస్టేట్‌ నిపుణులు  అంటున్నారు.

  • ఇన్వెస్టర్లు ఇప్పుడు కేవలం ఒకటి కాకుండా రెండు స్వీయ-ఆక్రమిత ఆస్తులకు నిల్ వాల్యుయేషన్‌ను క్లెయిమ్ చేయవచ్చు. ఇది రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ పెట్టుబడికి అనుకూలమైన చర్య.

  • పట్టణ మౌలిక సదుపాయాలను పెంచేందుకు ప్రభుత్వం  రూ.1 లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తుంది. అర్బన్ డెవలప్‌మెంట్ ఫండ్ ఏర్పాటు వల్ల మౌలిక సదుపాయాలు పెరుగుతాయని, రియల్ ఎస్టేట్ సామర్థ్యం పుంజుకుంటుందని, నగరాలు ప్రధాన వృద్ధి కేంద్రాలుగా మారుతాయని నిపుణులు తెలిపారు.

  • ప్రపంచ వ్యాపార కేంద్రంగా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేస్తూ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCC)ను ఆకర్షించడానికి, ప్రోత్సహించడానికి రాష్ట్రాలకు సహాయపడే జాతీయ మార్గదర్శక ఫ్రేమ్‌వర్క్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. పెరుగుతున్న దేశ ఆర్థిక ప్రభావం దృష్ట్యా ఈ చర్య బెంగళూరు, ముంబై, హైదరాబాద్, పూణె, చెన్నై వంటి ప్రధాన మెట్రోలతో పాటు టైర్-II, టైర్-III నగరాల్లో ఆఫీస్ స్పేస్ డిమాండ్‌ను పెంచుతుందని భావిస్తున్నారు.

    ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్‌ 2025-26 ముఖ్యాంశాలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)