Breaking News

Budget 2024: మహిళలకు కీలక ప్రకటనలు ఇవే..

Published on Thu, 02/01/2024 - 13:37

పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024 మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ మహిళలకు సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు చేశారు. నిర్మలా సీతారామన్ ప్రసంగంలోని బడ్జెట్ ప్రకటనలలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య బీమా కవరేజీని విస్తరించడం, లక్షపతి దీదీ పథకం లక్ష్యాన్ని పెంచడం వంటివి ఉన్నాయి. 

ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి-జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ఫండెడ్‌ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇది ద్వితీయ, తృతీయ సంరక్షణ ఆసుపత్రిలో చేరేందుకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల కవరేజీని అందిస్తుంది.

ఇక కేంద్ర ప్రబుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న ‘లక్షపతి దీదీ’ పథకం లక్ష్యాన్ని పెంచనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ పథకం కింద ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందుతుండగా దీన్ని 3 కోట్ల మందికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే తొమ్మిది నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు.

మహిళా సాధికారతపై మంత్రి మాట్లాడుతూ, "10 సంవత్సరాలలో ఉన్నత విద్యలో మహిళల నమోదు 28 శాతం పెరిగింది, సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథమేటిక్స్‌ (STEM)  కోర్సులలో బాలికలు, మహిళలు 43 శాతం నమోదు చేసుకున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఈ పురోగతులన్నీ శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంలో ప్రతిబింబిస్తాయి. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయడం, పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 1/3 సీట్ల రిజర్వేషన్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 70 శాతం ఇళ్లు మహిళలకు గౌరవాన్ని పెంచాయి." అన్నారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)