Breaking News

బీఎస్‌ఎన్‌ఎల్‌ బైటీవీ ప్రీమియం ప్యాక్‌.. కేవలం రూ.151లకే..

Published on Fri, 08/29/2025 - 14:03

ప్రభుత్వ టెలికమ్‌ దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ వినియోగదారుల కోసం బైటీవీ ప్రీమియం ప్యాక్‌ను ప్రారంభించింది. డిజిటల్ వినోదాన్ని ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 25 పైగా ఓటీటీలు, 450 పైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించే సౌలభ్యాన్ని రూ .151 లకే అందిస్తోంది.

బైటీవీ ప్రీమియం ప్యాక్లో ప్రముఖ ఓటీటీ సేవలు ఉన్నాయి. జీ5, సోనీలివ్, లయన్స్‌గేట్ ప్లే, ఆహా, షెమారూమీ, సన్ ఎన్‌ఎక్స​్‌టీ, డిస్కవరీ, ఎపిక్ ఆన్, ఈటీవీ విన్, చౌపాల్ వంటి ఓటీటీలు ఇందులో ఉన్నాయి.  సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ప్రాంతీయ కంటెంట్, లైవ్ టెలివిజన్‌ను వివిధ భాషలలో స్ట్రీమ్ చేయవచ్చు.  ఇవన్నీ బీఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదారులకు ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న బైటీవీ యాప్ ద్వారా వీక్షించవచ్చు.

బైటీవీ ప్రీమియం ప్యాక్‌కు సంబంధించి బీఎస్ఎన్ఎల్ అధికారికంగా ఎలాంటి వ్యాలిడిటీని ధృవీకరించనప్పటికీ, రూ .151 ప్యాక్‌ వ్యాలిడిటీ 30 రోజులు ఉంటుందని చాలా నివేదికలు పేర్కొంటున్నాయి.  కాగా ఇందులో అనేక పాపులర్‌ ఓటీటీ సర్వీసలు ఉన్నప్పటికీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లను మాత్రం ఈ ఆఫర్‌లో చేర్చకపోవడం గమనార్హం.

2025 ఫిబ్రవరిలో ఉచిత పైలట్‌గా ప్రారంభమైన బైటీవీ ఇప్పుడు పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్‌గా రూపాంతరం చెంది ఓటీటీ అగ్రిగేషన్ స్పేస్‌లో బీఎస్ఎన్ఎల్‌ను గట్టి పోటీదారుగా నిలబెట్టింది.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)