Breaking News

బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్!

Published on Thu, 07/09/2026 - 15:37

ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్‌) దేశీయ మార్కెట్లోకి అధునాతన శాటిలైట్ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. సాధారణ మొబైల్ నెట్‌వర్క్‌లు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో సైతం నిరంతరాయంగా కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. అన్ని పన్నులతో కలుపుకుని ఈ హ్యాండ్‌సెట్ ధరను రూ.1,34,166 గా నిర్ణయించారు.

ఎందుకంత ధర?

ఈ ఫోన్ ధర వినగానే సామాన్య స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆశ్చర్యపోవడం సహజం. అయితే, ఇది రోజువారీ అవసరాల కోసం రూపొందించిన సాధారణ మొబైల్ కాదు. భూమిపై ఉండే సెల్యులార్ టవర్లతో సంబంధం లేకుండా నేరుగా ఉపగ్రహాల ద్వారా ఇది సిగ్నల్స్ అందుకుంటుంది. సాంప్రదాయ నెట్‌వర్క్‌లు పూర్తిగా విఫలమయ్యే అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాయిస్ కమ్యూనికేషన్‌ను అందించడమే దీని ప్రత్యేకత. అందుకే దీనికి అంత ప్రీమియం ధర ఉంది.

ఈ ఫోన్ ప్రత్యేకతలు

ప్రముఖ అంతర్జాతీయ శాటిలైట్ నెట్‌వర్క్ సంస్థ ‘ఇన్‌మర్‌శాట్‌’ భాగస్వామ్యంతో బీఎస్ఎన్ఎల్ ఈ మిషన్ క్రిటికల్ కమ్యూనికేషన్ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రధాన ఫీచర్లు..

  • మొబైల్ టవర్ల పరిధితో సంబంధం లేకుండా దేశంలోని ఏ మారుమూల ప్రాంతం నుంచైనా నేరుగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.

  • ఎంతటి ప్రతికూల వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా పటిష్టమైన బాడీతో ఈ ఫోన్‌ను రూపొందించారు.

  • అత్యవసర సమయాల్లో ప్రాణాలను రక్షించేందుకు ప్రత్యేక ఎస్‌ఓఎస్‌ ఫీచర్‌ను ఇందులో పొందుపరిచారు.

  • విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లో కూడా ఎక్కువ కాలం పనిచేసేలా లాంగ్‌ లైఫ్‌ బ్యాటరీ దీని సొంతమని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది.

ఈ ఫోన్ ఎవరికి ఉపయోగపడుతుంది?

సాధారణ పౌరుల కంటే కూడా నిర్దిష్ట రంగాల్లో క్లిష్టమైన విధుల్లో ఉన్నవారి కోసం బీఎస్ఎన్ఎల్ దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసింది. రక్షణ రంగం, సరిహద్దు భద్రతా దళాలు, సముద్రయాన, నౌకాదళ కార్యకలాపాలు, విపత్తు నిర్వహణ సంస్థలు, మైనింగ్, మారుమూల పారిశ్రామిక ప్రాజెక్టులు, అడ్వెంచర్ ట్రావెలర్స్, పర్వతారోహకుల.. వంటి ప్రత్యేక కార్యకలాపాలు నిర్వహించేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ చెప్పింది.

కొనుగోలు చేయడం ఎలా? అర్హతలేంటి?

ఈ శాటిలైట్ ఫోన్ సాధారణ ఆన్‌లైన్ స్టోర్లలో లేదా రిటైల్ మొబైల్ షాపుల్లో దొరకదు. దీనిని కొనుగోలు చేయాలనుకునే వారు కొన్ని ప్రత్యేక నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఆసక్తి గల వినియోగదారులు నేరుగా తమ సమీప బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయాన్ని ఆశ్రయించాలి. జాతీయ భద్రత, వ్యూహాత్మక కారణాల దృష్ట్యా ఈ ఫోన్‌ను ఏ అవసరం కోసం కొనుగోలు చేస్తున్నారనే పూర్తి వివరాలను బీఎస్ఎన్ఎల్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. కంపెనీ నిర్దేశించిన నిబంధనలు, అర్హత ప్రమాణాలకు లోబడి, అవసరమైన అనుమతులు లభించిన తర్వాతే ఈ హ్యాండ్‌సెట్‌ను విక్రయిస్తారు.

ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప మార్పు

#

Tags : 1

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)