Breaking News

రూ.200 కంటే తక్కువ రీఛార్జ్: డైలీ 2జీబీ డేటా..

Published on Sun, 11/30/2025 - 20:38

భారతదేశంలో టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా కంపెనీలు అగ్రస్థానాలను దక్కించుకోవడానికి వివిధ ప్రీపెయిడ్ & పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఇప్పుడు తాజాగా 28 రోజుల ప్లాన్ తీసుకొచ్చింది.

బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ 199 రూపాయల రీఛార్జ్ ప్లాన్ ద్వారా.. 28 రోజుల పాటు రోజుకి 2జీబీ డేటా, అపరిమిత కాల్స్ వంటి వాటితోపాటు రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందవచ్చు. ఈ విషయాన్ని సంస్థ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.

రూ.251 రీఛార్జ్ ప్లాన్
బీఎస్ఎన్ఎల్ స్టూడెంట్ ప్లాన్ పేరుతో పరిచయం చేసిన ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 251 మాత్రమే. వ్యాలిడిటీ 28 రోజులు. అంటే రోజుకు 8.96 రూపాయలన్నమాట. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ పరిమిత కాలం మాత్రమే (నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకు) అందుబాటులో ఉంటుంది.

28 రోజులు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా 100జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందవచ్చు. ఇది బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సందరించడం ద్వారా, అధికారిక వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)