అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఒక్క రూపాయి రీచార్జ్ ఆఫర్.. అన్లిమిటెడ్ బెనిఫిట్స్!
Published on Sun, 10/18/2026 - 14:18
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన ప్రత్యేక రూ.1 ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ను మరోసారి పొడిగించింది. ‘ఫ్రీడమ్ 2.0’ పేరుతో అందిస్తున్న ఈ ప్లాన్ను వినియోగదారులు నవంబర్ 9 వరకు పొందవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను కోరుకునే మొబైల్ వినియోగదారులకు ఈ ఆఫర్ ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, ఈ ప్లాన్ సర్వీస్ వ్యాలిడిటీని గతంలో ఉన్న 30 రోజుల నుంచి 24 రోజులకు సవరించారు.
రోజుకు 1GB డేటా, అపరిమిత కాలింగ్
బీఎస్ఎన్ఎల్ రూ.1 ప్లాన్లో భాగంగా వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. దీంతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు, రోజుకు 1GB హైస్పీడ్ డేటాను అందిస్తున్నారు. ఈ ప్రయోజనాలు 24 రోజుల వ్యాలిడిటీకి వర్తిస్తాయి. అంటే, తక్కువ మొత్తంతో కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ సేవలను పొందాలనుకునే వారికి ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.
నవంబర్ 9 వరకు ఆఫర్
ఫ్రీడమ్ 2.0 పేరుతో అందిస్తున్న ఈ ప్రత్యేక ఆఫర్ను బీఎస్ఎన్ఎల్ నవంబర్ 9, 2026 వరకు పొడిగించింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు తమ సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా అధీకృత రిటైలర్ను సంప్రదించి ఈ ఆఫర్ను పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ కొత్త వినియోగదారులకు మాత్రమే. ఇదివరకే ఒకసారి సిమ్ తీసుకుని వినియోగిస్తున్నవారికి ఈ ఆఫర్ వర్తించదు.
ఇదీ చదవండి: రైల్వే కౌంటర్ టికెట్లకు ఇక కొత్త సదుపాయం.. ఈ 27 నుంచే..
Tags : 1