Breaking News

BSNL యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌

Published on Sat, 08/30/2025 - 17:27

ప్ర‌భుత్వం టెలికం సంస్థ భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్‌) ఆన్‌లైన్ సేవ‌ల్లో ప్రైవేటు కంపెనీల‌తో పోటీ ప‌డుతోంది. ప్రిపెయిడ్‌, పోస్ట్ పెయిడ్‌, డేటా ప్లాన్ల‌తో ప్రైవేటు సంస్థ‌ల‌కు దీటుగా దూసుకెళుతున్న బీఎస్ఎన్ఎల్ (BSNL) మ‌రో ముంద‌డుగు వేయ‌బోతోంది. వినియోగ‌దారుల కోసం త్వ‌ర‌లో కోసం కొత్త స‌ర్వీసును అందుబాటులోకి తెచ్చేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది.

స్మార్ట్‌ఫోన్ వినియోగ‌దారులు ఆర్థిక లావేదేవీలు, బిల్లుల చెల్లింపుల కోసం ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం లాంటి ప్రైవేటు డిజిట‌ల్ యాప్‌ల‌ను ఎక్కువ‌గా వాడుతున్నారు. బీఎస్ఎన్ఎల్ కూడా త్వ‌ర‌లోనే యూనిఫైడ్ పేమెంట్ ఇంట‌ర్‌ఫేస్‌ (యూపీఐ) సేవ‌ల‌ను ప్రారంభించ‌నుంది. బీఎస్ఎన్ఎల్ పే పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ (భీమ్) యూపీఐ ఆధారంగా బీఎస్ఎన్ఎల్ పే (BSNL Pay) సేవల‌ను వినియోగించుకునేలా దీన్ని రూపొందిస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల‌ స‌మాచారం.

దీపావళి నాటికి ప్రారంభం!
బీఎస్ఎన్ఎల్ పే సేవ‌లు వినియోగ‌దారుల‌కు దీపావ‌ళి (Diwali) నాటికి అందుబాటులోకి వ‌స్తాయ‌ని మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ పే అనేది ప్ర‌త్యేక‌మైన యాప్ కాదు. బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్‌లో భాగంగానే ఇది ఉంటుంది. భీమ్ యూపీఐ ద్వారా దీని సేవ‌ల‌ను యూజ‌ర్లు వినియోగించుకోవ‌చ్చు.

ఎలాంటి సేవ‌లు అందిస్తుంది?
ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం (Paytm) మాదిరిగానే బీఎస్ఎన్ఎల్ పే ద్వారా అన్ని రకాల ఆన్‌లైన్ చెల్లింపులు చేయగలుగుతారు. సెల్ఫ్ కేర్ యాప్ వినియోగ‌దారులు సులువుగా ఈ సేవలు ఉప‌యోగించుకోవ‌చ్చు. యూజ‌ర్ల‌కు నాణ్య‌మైన డిజిట‌ల్ సేవ‌లు అందించ‌డంతో పాటు, దేశంలో వేగంగా విస్త‌రిస్తున్న యూపీఐ చెల్లింపుల మార్కెట్‌లో త‌మ దైన ముద్ర వేయాల‌ని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. బీఎస్ఎన్ఎల్ పే సేవలు అందుబాటులోకి వ‌స్తే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం లాంటి ప్రైవేటు డిజిట‌ల్ యాప్‌ల‌కు గ‌ట్టి పోటీ ఎదుర‌వుతుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. 

చ‌ద‌వండి: ఉచిత డిజిట‌ల్ యూపీఐ యాప్‌లు ఎలా సంపాదిస్తాయంటే..?

#

Tags : 1

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)