Breaking News

బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్లాన్లు.. ఇక నో వ్యాలిడిటీ టెన్షన్‌!

Published on Mon, 02/24/2025 - 15:23

ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) మరింత మంది కస్టమర్లను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు తన పోర్ట్‌ఫోలియోలో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను (prepaid plans) జోడిస్తోంది. ఈ క్రమంలోనే మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇవి అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా, ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక వాలిడిటీతో వస్తాయి.

150 రోజుల ప్లాన్
బీఎస్ఎన్ఎల్ 150 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ .397. ఇది అపరిమిత కాలింగ్ 2 జీబీ రోజువారీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు  అందిస్తుంది.  అయితే ప్రయోజనాలన్నీ మొదటి 30 రోజులు మాత్రమే ఉంటాయి. మిగిలిన 120 రోజులకు నంబర్‌కు వ్యాలిడిటీ అందుబాటులో ఉంటుంది. కాలింగ్‌, డేటా ప్రయోజనాల కన్నా ఇన్ కమింగ్ కాల్స్, సిమ్ ను యాక్టివ్ గా ఉంచుకోవడం  ముఖ్యం అనేకునేవారికి ఈ ప్లాన్‌ సరిపోతుంది.

ఇదీ చదవండి: ఎయిర్‌టెల్ బెస్ట్‌ మంత్లీ రీఛార్జ్ ప్లాన్లు ఇవే..

160 రోజుల ప్లాన్
160 రోజుల వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్ ధర రూ.997. ఈ ప్లాన్ మొత్తం వ్యాలిడిటీ కాలానికి అపరిమిత కాలింగ్, 2 జీబీ రోజువారీ డేటా, 100 ఎస్ఎంఎస్‌ ప్రయోజనాలను అందిస్తుంది. కాలింగ్, డేటాతో లాంగ్ టర్మ్ వాలిడిటీ కోరుకునే యూజర్లకు ఈ ప్లాన్ మరింత అనుకూలంగా ఉంటుంది.

180 రోజుల ప్లాన్
ఇది ఆరు నెలల వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్. దీని ధర రూ .897. ఈ ప్లాన్ ద్వారా అన్ని నెట్వర్క్‌లకు అపరిమిత కాలింగ్, 180 రోజుల పాటు 90 జీబీ మొత్తం డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. రోజువారీ కోటా గురించి ఆందోళన చెందకుండా ఒకేసారి ఎక్కువ డేటా కావాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ అనువైనది.

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)