Breaking News

5జీ కోసం బీఎస్ఎన్ఎల్ ప్లాన్: జియోకు పోటీ!?

Published on Sun, 02/09/2025 - 15:58

భారతదేశంలో జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికాం ఆపరేటర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వీటికి గట్టి పోటీ ఇవ్వడానికి, యూజర్లకు మెరుగైన సేవలు అందించడానికి 'భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్' (BSNL) సిద్ధమైంది.

దేశంలో నాల్గవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్.. 'బీఎస్ఎన్ఎల్' దేశవ్యాప్తంగా మెరుగైన సేవలను అందించడానికి తన నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. ఈ కంపెనీ ఇప్పటికే 65,000 4జీ సైట్‌లను ఏర్పాటు చేసింది. ఇటీవల కేరళలో కూడా 5,000 కొత్త సైట్‌లను జోడించింది. కంపెనీ దేశం అంతటా మొత్తం ఒక లక్ష 4G సైట్‌లను చేరుకోవడమే లక్ష్యంగా కృషి చేస్తోంది.

బీఎస్ఎన్ఎల్ ప్రపంచంలోనే అత్యంత సరసమైన 4G టారిఫ్‌లను అందించడంలో ప్రసిద్ధి చెందింది. అయితే కనెక్టివిటీని మెరుగుపరచడానికి, కంపెనీ వివిధ ప్రాంతాలలో కొత్త సైట్ ఇన్‌స్టాలేషన్‌లను చురుకుగా ప్లాన్ చేస్తోంది. కంపెనీ ఒక లక్ష 4జీ సైట్ లక్ష్యాన్ని పూర్తి చేసిన తర్వాత.. 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం.

బీఎస్ఎన్ఎల్ తన 4జీ నెట్‌వర్క్‌ను 5జీకి అప్‌గ్రేడ్ చేయడానికి.. 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) సహకరిస్తోంది. కంపెనీ తన ప్రస్తుత 4జీ మౌలిక సదుపాయాలను సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ ద్వారా 5జీగా మార్చాలని యోచిస్తోంది. ఎయిర్‌టెల్ మాదిరిగానే కంపెనీ భారతదేశం అంతటా 5జీ నాన్ స్టాండలోన్ (NSA) టెక్నాలజీని కూడా విడుదల చేయడానికి యోచిస్తోంది.

ఇదీ చదవండి: వాట్సాప్‌లోనే కరెంట్ బిల్, మొబైల్ రీఛార్జ్: కొత్త ఫీచర్ వచ్చేస్తోంది

బీఎస్ఎన్ఎల్ 5జీ స్టాండలోన్ (SA) టెక్నాలజీని పరీక్షిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో 5G SA టెస్టింగ్ జరుగుతోంది. ఇవన్నీ సవ్యంగా జరిగితే.. ఇంటర్నెట్ సేవలు మరింత చౌకగా లభిస్తాయి. ఇదే జరిగితే జియో, ఎయిర్‌టెల్ యూజర్లు కూడా బీఎస్ఎన్ఎల్ వైపు తిరిగే అవకాశం ఉంది. మొత్తం మీద కంపెనీ తన నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంలో మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా వినియోగదారులకు వేగవంతమైన కనెక్టివిటీని తీసుకురావడానికి కృషి చేస్తోంది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)