ఒక్కసారే రీచార్జ్‌.. ఏడాదంతా వ్యాలిడిటీ

Published on Sat, 03/15/2025 - 21:27

BSNL 365 Days Plan: ప్రభుత్వ రంగ టెలికమ్‌ సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం చౌకైన, సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది పూర్తి ఏడాది అంటే 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ సిమ్‌ను సెకండరీ నంబర్‌గా వాడే యూజర్లకు ఈ ప్లాన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్ ధర కేవలం రూ .1198 మాత్రమే. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఏడాది. దీని ప్రకారం దీని నెలవారీ సగటు సుమారు రూ.100 వరకు ఉంటుంది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్‌ యాక్టివ్ గా ఉండాలనుకునే యూజర్లకు ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది.

ప్లాన్ ప్రయోజనాలు 
బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్‌తో వినియోగదారులు ప్రతి నెలా 300 నిమిషాల వరకు ఏ నెట్వర్క్‌కైనా ఉచిత కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. ఇది కాకుండా ప్రతి నెలా 30 ఉచిత ఎస్ఎంఎస్‌లతో పాటు ప్రతి నెలా 3 జీబీ హైస్పీడ్ డేటా కూడా లభిస్తుంది. అంతే కాదు దేశం అంతటా రోమింగ్ సమయంలో ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్ ప్రయోజనాన్ని కూడా పొందుతారు.

బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నెట్‌వర్క్ విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.6,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ 4జీ సేవలను అప్‌గ్రేడ్ చేయడానికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని, తద్వారా త్వరలోనే వినియోగదారులకు మెరుగైన నెట్‌వర్క్, వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)