Breaking News

‘మీరూ జాగ్రత్తగా ఉండాలి’

Published on Fri, 04/25/2025 - 08:43

పెట్టుబడుల విషయంలో నియంత్రణ నిబంధనలు మాత్రమే మదుపరులను కాపాడలేవని, ఇన్వెస్టర్లు కూడా తప్పకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని బీఎస్‌ఈ ఎండీ సుందరరామన్‌ రామమూర్తి తెలిపారు. సొంతంగా విషయాలను ఆకళింపు చేసుకోకుండా, వాళ్లూ వీళ్లు చెప్పిన మాటల మీద ఆధారపడి ఇన్వెస్ట్‌ చేసే ధోరణి మంచిది కాదని వ్యాఖ్యానించారు.

‘కూరగాయలు కొనుక్కునేటప్పుడు ముందుగానే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ మీ జీవితకాల ఆదాయాన్ని పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం ఎవరో చెప్పిన మాటలు విని ముందూ, వెనకా చూసుకోకుండా ఇన్వెస్ట్‌ చేస్తారు. అలా చేయొద్దు. మీకు అర్థమైనదే ట్రేడ్‌ చేయండి. ఏం ట్రేడ్‌ చేస్తున్నారో అర్థం చేసుకోండి. లేకపోతే సమస్యలు తప్పవు. మిమ్మల్ని మీరు కాపాడుకోదల్చుకోకపోతే ఎన్ని నిబంధనలున్నా ఏవీ మిమ్మల్ని రక్షించలేవు. కాబట్టి అలర్టుగా ఉండండి’ అని రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం కలకత్తా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా హెచ్చరించారు.  

ఇదీ చదవండి: అనుకున్నదొకటి అయినదొకటి..

మార్కెట్‌పై అవగాహన లేని రిటైల్‌ ఇన్వెస్టర్లు పెట్టుబడుల కోసం మ్యుచువల్‌ ఫండ్‌ మార్గాన్ని ఎంచుకోవడం శ్రేయస్కరమని సూచించారు. అప్పుడు కూడా థీమ్యాటిక్‌ ఫండ్స్‌ జోలికి వెళ్లకుండా విస్తృత సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసే మ్యుచువల్‌ ఫండ్లు లేదా లార్జ్‌ క్యాప్‌ ఫండ్లను ఎంచుకోవడం మంచిదని పేర్కొన్నారు. కెరియర్‌ ప్రారంభించిన తొలినాళ్ల నుంచే పెట్టుబడులు పెట్టడాన్ని అలవర్చుకోవాలని మహిళలు, యువతకు రామమూర్తి సూచించారు. నియంత్రణ సంస్థలు, స్టాక్‌ ఎక్సే్చంజీలు ఎంత అప్రమత్తంగా ఉన్నా కొన్ని ఎస్‌ఎంఈ లిస్టింగ్‌లలో అవకతవకలు జరిగే అవకాశాలను తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. ఐపీవో పత్రాల్లో అనుమానాస్పద అంశాలను పసిగట్టేందుకు ఏఐ, లార్జ్‌ ల్యాంగ్వేజ్‌ మోడల్స్‌ను బీఎస్‌ఈ ట్రయల్‌ ప్రాతిపదికన ఉపయోగిస్తోందని రామమూర్తి చెప్పారు.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)