Breaking News

ఫైబర్‌ టెక్‌లో లక్ష కొలువులు..

Published on Tue, 11/26/2024 - 01:06

ముంబై: బ్రాడ్‌బ్యాండ్, 5జీ నెట్‌వర్క్‌ సహా డిజిటల్‌ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వచ్చే అయిదేళ్లలో ఫైబర్‌ టెక్నాలజీ విభాగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. ఫైబర్‌ ఇన్‌స్టాలేషన్, మెయింటెనెన్స్, రిపేర్‌ సెగ్మెంట్లలో  కొత్తగా లక్ష ఉద్యోగాలు రానున్నాయి. టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ చీఫ్‌ స్ట్రాటెజీ ఆఫీసర్‌ పి. సుబ్బురత్నం ఈ విషయాలు వెల్లడించారు. 

2024లో దేశీయంగా టెలికం మార్కెట్‌ 48.61 బిలియన్‌ డాలర్లుగా ఉండగా ఏటా 9.40 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2029 నాటికి 76.16 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. 2023 నాటికి దేశవ్యాప్తంగా 7 లక్షల కిలోమీటర్ల మేర ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ వేయడం పూర్తయిందని, డిజిటల్‌ మౌలిక సదుపాయాలు విస్తరించడానికి ఇది గణనీయంగా ఉపయోగపడిందని వివరించారు. 

అసాధారణమైన స్పీడ్, తక్కువ లేటెన్సీ, మరింత మెరుగైన కనెక్టివిటీని అందిస్తూ 2030 నాటికి  5జీ టెక్నాలజీ మరింతగా విస్తరించనుందని సుబ్బురత్నం చెప్పారు. ‘ప్రభుత్వం, టెలికం సంస్థలు ఫైబర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విస్తరణపై దృష్టి పెడుతుండటంతో ఫైబర్‌ టెక్నీషియన్లకు డిమాండ్‌ గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో కొత్తగా సుమారు లక్ష ఉద్యోగావకాశాలు రానున్నాయి‘ అని సుబ్బురత్నం చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా ఫైబర్‌ టెక్నీషియన్ల సంఖ్య సుమారు 5 లక్షల పైగా ఉన్నట్లు అంచనా.  

ఇంజనీర్లు, టెక్నీషియన్లకు డిమాండ్‌... 
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టే టెలికం, ఐటీ, నిర్మాణ, తయారీ తదితర రంగాల్లో ఫైబర్‌ సాంకేతిక నిపుణుల అవసరం ఉంటుంది. ఫైబర్‌ ఇంజనీర్లు, ఫైబర్‌ టెర్మినేషన్‌ ఎక్విప్‌మెంట్‌ టెక్నీషియన్లు, ఇన్‌స్టాలేషన్‌.. రిపేరు, ఫాల్ట్‌ రిజల్యూషన్‌ టీమ్, ఫైబర్‌ సెల్‌సైట్‌ ఇంజనీర్లు, ఫీల్డ్‌ టెక్నీషియన్లు మొదలైన వర్గాలకు డిమాండ్‌ నెలకొనవచ్చని సుబ్బురత్నం చెప్పారు. అయితే, అట్రిషన్‌ రేటు అధిక స్థాయిలో వార్షికంగా 35–40%గా ఉంటోందన్నారు. సుదీర్ఘ పనిగంటలు, వేతనాల పెంపు చాలా తక్కువగా ఉండటం, ఉద్యోగులను ఇతర సంస్థలను ఎగరేసుకు పోతుండటం తదితర అంశాలు కారణమని వివరించారు.  
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)