Breaking News

సరికొత్త బ్రిక్స్‌టన్‌ బైక్: దీని గురించి తెలుసా?

Published on Sun, 10/05/2025 - 17:05

బ్రిక్స్‌టన్‌ మోటార్ సైకిల్స్.. తన మొట్టమొదటి మిడ్-కెపాసిటీ అడ్వెంచర్ మోటార్ సైకిల్ అయిన 'స్టోర్ 500'(Storr 500)ను ఆస్ట్రియాలోని తన ప్రధాన కార్యాలయంలో అధికారికంగా ఆవిష్కరించింది. ఈ బైక్ కోసం ప్రీ-బుకింగ్‌లు డిసెంబర్ 2025లో ప్రారంభమవుతాయి. ఆ తరువాత డెలివరీ ఎప్పుడనే విషయాన్ని సంస్థ వెల్లడించనుంది. ముందుగా బుక్ చేసుకున్నవారికి.. ముందుగా డెలివరీలు జరుగుతాయని సంస్థ వెల్లడించింది.

బ్రిక్స్‌టన్‌ స్టోర్ 500 బైక్.. 486 సీసీ లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్ ద్వారా 8500 ఆర్పీఎం వద్ద 47.6 బీహెచ్పీ పవర్, 6750 ఆర్పీఎం వద్ద, 43 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ బైక్ యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్, సెంట్రల్ రియర్ మోనోషాక్ వంటి సస్పెన్షన్ సెటప్ పొందుతుంది. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌తో డిస్క్ బ్రేక్‌లు ఈ బైకులో ఉంటాయి.

ఇదీ చదవండి: జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్ బోర్డులు: ఎందుకంటే?

ఫీచర్స్ విషయానికి వస్తే.. కనెక్టివిటీ ఎంపికలతో కూడిన 5 ఇంచెస్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ఎల్ఈడీ డీఆర్ఎల్ & ఇండికేటర్స్, ఇంటర్నల్ ఫాగ్ ల్యాంప్స్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ మొదలైనవి ఈ బైకులో ఉన్నాయి. అయితే కంపెనీ ఈ బైకుని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తుందా?, లేదా అనేది వెల్లడించలేదు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)