Breaking News

గూగుల్‌కు రూ. 26వేల కోట్ల ఫైన్.. ఎందుకంటే?

Published on Mon, 10/28/2024 - 15:29

ఓ చిన్న వెబ్‌సైట్‌ మీద గూగుల్ కంపెనీ చూపిన నిర్లక్ష్యం భారీ జరిమానా చెల్లించేలా చేసింది. 2006లో యూకేకు చెందిన శివన్, ఆడమ్ రాఫ్ అనే దంపతులు ప్రైస్ కంపారిజన్ వెబ్‌సైట్ 'ఫౌండమ్' ప్రారంభించారు. కానీ దీనిని వినియోగంలోకి తీసుకువచ్చిన తరువాత గూగుల్‌లో విజిబిలిటీ తగ్గడం మొదలైంది. ప్రజలు కీ వర్డ్ ఉపయోగించి సెర్చ్ చేసినప్పటికీ.. వెబ్‌సైట్‌ కనిపించకపోవడాన్ని ఫౌండర్స్ కనిపెట్టారు.

తమ వెబ్‌సైట్‌ గూగుల్‌కు చెందిన ఆటోమేటెడ్‌ స్పామ్‌ ఫిల్టర్స్‌ విధించిన పెనాల్టీ కారణంగా పడిపోతుండటం గమనించిన.. ఆ వ్యవస్థాపకులు గూగుల్ దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న గూగుల్ రెండేళ్ళైనా పెనాల్టీ తొలగించలేదు. ఇక చేసేదేమీ లేక ఆ దంపతులు యూరోపియన్ కమిషన్‌ను 2010లో సంప్రదించారు.

ఫౌండమ్ వ్యవస్థాపకులు ఫిర్యాదును కమిషన్ అధికారులు దర్యాప్తు చేసి.. గూగుల్ కంపెనీ తన షాపింగ్ సర్వీసును ప్రమోట్ చేసుకోవడానికే వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవరించి అన్యాయం చేసిందని గుర్తించింది. గూగుల్ చేసిన ఈ అన్యాయానికి 2.4 బిలియన్ ఫౌండ్స్ (సుమారు రూ. 26వేల కోట్లు) జరిమానా విధిస్తూ కమిషన్ 2017లో తీర్పునిచ్చింది.

ఇదీ చదవండి: డిజిటల్ కామ్‌డోమ్: ఇదెలా పనిచేస్తుందంటే..

యూరోపియన్ కమిషన్‌ తీర్పు ఇచ్చిన తరువాత గూగుల్ అప్పీల్‌కు వెళ్ళింది. సుమారు ఏడేళ్ల తరువాత కమిషన్ ఇచ్చిన తీర్పును 2024లో యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సమర్థించింది. తీర్పు చాలా ఆలస్యమైందని శివన్, ఆడమ్ రాఫ్ స్పందించారు. ఆలస్యమైనా.. పోరాటానికి ఫలితం దక్కిందని అన్నారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)