Breaking News

లోకల్‌తో పోటీకి బ్రిటానియా రెడీ

Published on Wed, 02/18/2026 - 18:53

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిన్న సంస్థలతో పోటీ పడేందుకు బ్రిటానియా ఇండస్ట్రీస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. చిన్న సంస్థలతో పోటీపడేందుకు స్టార్టప్‌ స్వభావంతో బ్రిటానియా వ్యవహరిస్తుందని.. ఈ–కామర్స్‌ విభాగంలో బిస్కెట్లు, రస్క్, కేక్, వేఫర్‌ల విభాగాల్లో మరింత బలంగా అవతరిస్తామని సంస్థ ఎండీ, సీఈవో రక్షిత్‌ హర్గవే తెలిపారు.

‘‘ప్రాంతీయ పోటీని ఎదుర్కొంటాం. ఈ–కామర్స్‌లో విస్తరణపై పెట్టుబడులు పెడతాం. అమ్మకాలు పెంచుకునేందుకు మాకు తగినన్ని అవకాశాలున్నాయని భావిస్తున్నాం’’అని వాటాదారులతో నిర్వహించిన కాల్‌లో భాగంగా చెప్పారు. విక్రయాలు పెంచుకునేందుకు మరింత మంది వినియోగదారులను చేరుకోవడం కీలకమని పేర్కొన్నారు. గుడ్‌డే, టైగర్, నూట్రిచాయిస్, మ్యారీగోల్డ్‌ తదితర పాపులర్‌ బ్రాండ్లు బ్రిటానియా ఇండస్ట్రీస్‌ సొంతం. చిన్న కంపెనీలను ప్రాంతీయ పోటీదారులుగానే చూస్తామంటూ.. కేవలం తూర్పునే కాకుండా దేశవ్యాప్తంగా చిన్న సంస్థల నుంచి వస్తున్న పోటీని సవాలుగా పేర్కొన్నారు.

ద్రవ్యోల్బణం వల్లే.. 
ద్రవ్యోల్బణం, ధరలు పెంచడంలో జాప్యం లోగడ మార్జిన్లపై ప్రభావం చూపించిందని, కమోడిటీ ధరలు దిగిరావడతో కంపెనీ లాభదాయకత మెరుగుపడినట్టు రక్షిత్‌ హర్గవే చెప్పారు. కీలకమైన ముడి పదార్థాలు, పాలు గోధుమల ధరలు స్థిరంగానే ఉన్నాయని.. రానున్న రోజుల్లో ఎలా ఉంటాయో చూడాలన్నారు. చెక్కెర, కోకోవా ధరలు స్థిరంగా ఉండొచ్చన్నారు.  

కొనుగోళ్లకూ సై.. 
విస్తృతమైన పోర్ట్‌ఫోలియో నిర్మాణం దిశగా అవసరమైతే కొనుగోళ్ల అవకాశాలనూ బ్రిటానియా ఇండస్ట్రీస్‌ పరిశీలిస్తుందని చెప్పారు. అన్నీ సొంతంగానే నిర్మించుకోవడం సాధ్యం కాదన్నారు. చిన్న సంస్థలు ప్రాంతీయంగా అక్కడి ప్రజల ఇష్టాలు, అభిరుచులను మరింత మెరుగ్గా అర్థం చేసుకోగలవని, అవి వాటి బలమని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ విపిన్‌ కటారియా తెలిపారు. వాటితో పోటీపడేందుకు బ్రాండ్‌ నిర్మాణంపై పెట్టుబడులు పెడుతున్నట్టు వాటాదారుల సమావేశంలో చెప్పారు.

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)