Breaking News

చేతిలో ఇమిడిపోయేలా.. వంటింటికి పనికొచ్చే వాక్యూమ్‌ క్లీనర్‌

Published on Sun, 10/29/2023 - 13:18

ఇళ్లల్లో సాధారణంగా ఉపయోగించే వాక్యూమ్‌ క్లీనర్లు చాలా పెద్దగా ఉంటాయి. నేరుగా ఎలక్ట్రిక్‌ కనెక్షన్‌తో పనిచేసేవి కొన్ని, రీచార్జబుల్‌ బ్యాటరీతో పనిచేసే రోబోటిక్‌ వాక్యూమ్‌ క్లీనర్లు కొన్ని. ఇవి నేలను శుభ్రం చేయడానికి బాగా పనికొస్తాయి.

వంటింటిని శుభ్రం చేయడానికి ఇవి అంత అనువైనవి కాదు. మహా అయితే, ఇవి వంటింట్లోని నేలను మాత్రమే శుభ్రం చేయగలవు. ఇలాంటి వాక్యూమ్‌ క్లీనర్లు ఇంట్లో ఉన్నా, స్టవ్‌ పెట్టుకునే ప్లాట్‌ఫామ్, వాష్‌బేసిన్, డైనింగ్‌ టేబుల్‌ మీద పడిన చెత్తను తొలగించాలంటే చేతికి పని చెప్పక తప్పదు.

అమెరికన్‌ కంపెనీ బ్రిగీ చేతిలో ఇమిడిపోయే మినీ వాక్యూమ్‌ క్లీనర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది వంటింటి అవసరాలకు పూర్తిగా అనువైనది. స్టవ్‌ ప్లాట్‌ఫామ్‌ మీద, డైనింగ్‌ టేబుల్స్‌ మీద పడిన చెత్తను ఇట్టే తొలగిస్తుంది. అంతేకాదు, మంచాల మీద, సోఫాల మీద పడిన చెత్తను కూడా క్షణాల్లో తొలగించి, శుభ్రం చేస్తుంది. ఇది రీచార్జబుల్‌ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీని బరువు 375 గ్రాములు మాత్రమే! దీనిలోని మూడంచెల ఫిల్టర్‌ సిస్టమ్‌ సూక్షా్మతి సూక్ష్మమైన చెత్త కణాలను కూడా సునాయాసంగా తొలగించగలదు. దీని ధర 69.99 డాలర్లు (రూ.5,825) మాత్రమే! 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)