Breaking News

ప్యాసివ్‌ ఫండ్లకు ‘స్మార్ట్‌ బీటా వ్యూహాలు’

Published on Mon, 02/16/2026 - 09:15

దేశీయంగా పెట్టుబడుల పరిస్థితుల్లో ఇటీవల గణనీయమైన మార్పులు వస్తున్నాయి. తక్కువ ఖర్చు, వైవిధ్యం, పారదర్శకత, దీర్ఘకాల క్రమశిక్షణ తదితర అంశాలకు ఇన్వెస్టర్లు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ‘ప్యాసివ్‌ ఇన్వెస్టింగ్‌’ విధానం వేగంగా విస్తరిస్తోంది. ఇండెక్స్‌ ఫండ్లు, ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌లాంటి ప్యాసివ్‌ ఫండ్లు, స్వయంగా షేర్లను ఎంపిక చేసుకోవాల్సిన బాదరబందీ లేకుండా మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్యాసివ్‌ ఇన్వెస్టింగ్‌కి సంబంధించి ‘స్మార్ట్‌ బీటా వ్యూహాలు’ ఒక వినూత్న మార్గంగా అవతరిస్తున్నాయి.  

స్మార్ట్‌ బీటా వ్యూహాల నిర్వచనం..  

‘స్మార్ట్‌ బీటా వ్యూహాలు’ అనేవి ఇండెక్స్‌కు అనుసంధానమైన పెట్టుబడి వ్యూహాలు. ఇవి సంప్రదాయ ప్యాసివ్‌ ఫండ్ల మాదిరిగా కేవలం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఆధారంగా పనిచేయవు. ఈ వ్యూహంలో భాగంగా, ముందుగానే నిర్ణయించిన నిర్దిష్ట నియమాల ప్రకారం, పలు ఆర్థిక ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని షేర్లను ఎంపిక చేసి, వాటికి తగిన వెయిటేజీ కేటాయిస్తాయి. ఈ విధానం ‘ప్యాసివ్‌ ఇన్వెస్టింగ్‌’లోని సరళత్వాన్ని కొనసాగిస్తూనే, అదనంగా వ్యూహాత్మక దృష్టికోణాన్ని కూడా జోడిస్తుంది. దీనితో పోర్ట్‌ఫోలియో నుంచి మరింత మెరుగైన ఫలితాలను పొందేందుకు వీలవుతుంది.

ఫాక్టర్‌ ఆధారిత విధానం

స్మార్ట్‌ బీటా వ్యూహాల్లో విస్తృతంగా ఉపయోగించే కొన్ని ముఖ్యమైన ఫాక్టర్లు ఉన్నాయి. విలువ (వేల్యూ), మొమెంటం, నాణ్యత(క్వాలిటీ), తక్కువ వోలటిలిటీ (ఒడిదుడుకులు), సమానమైన వెయిటేజీ తదితర ఫ్యాక్టర్లను పరిగణలోకి తీసుకుంటారు. వీటిలో విలువ (వేల్యూ) అనే ఫాక్టర్, కంపెనీల షేర్ల వేల్యుయేషన్‌ ఆకర్షణీయంగా ఉందా లేదా అనే అంశాన్ని సూచిస్తుంది. మొమెంటం ఫాక్టర్‌ గతంలో స్థిరమైన పనితీరు కనబరిచిన కంపెనీ షేర్లపై దృష్టి సారిస్తుంది. నాణ్యత (క్వాలిటీ) ఫాక్టర్‌ ఆర్థికంగా బలమైన, స్థిరమైన లాభాలు కలిగిన కంపెనీల షేర్లను ఎంపిక చేస్తుంది. తక్కువ వోలటిలిటీ ఫాక్టర్‌ అనేది మార్కెట్‌తో పోలిస్తే తక్కువ ఒడిదుడుకులకు లోనయ్యే షేర్లను గుర్తిస్తుంది. సమానమైన వెయిటేజీ అనే ఫ్యాక్టర్‌ అన్ని షేర్లకు సమాన వెయిటేజీ ఇస్తూ, మధ్యతరహా, చిన్న కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తాయి.

రిస్క్‌లు, పరిమితులు

స్మార్ట్‌ బీటా వ్యూహాలకు కూడా కొన్ని రిస్క్‌లు, పరిమితులున్నాయి. ముఖ్యంగా ఫ్యాక్టర్‌ ఆధారిత రిస్క్‌. ఏదో ఒక ఫాక్టర్‌ కొన్ని మార్కెట్‌ పరిస్థితుల్లో బాగా పనిచేయవచ్చు. మరికొన్ని సమయాల్లో వెనుకబడే అవకాశం ఉంటుంది. సహజంగానే ప్యాసివ్‌ ఫండ్లు అనేవి మార్కెట్‌ సూచీలను అనుసరిస్తాయి. కాబట్టి, మార్కెట్‌ పడిపోతే వెంటనే ఫండ్‌ విలువా తగ్గుతుంది. కొన్నిసార్లు మంచి మార్కెట్‌ సమయంలోనూ సగటు లాభాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఒకే రంగానికి పరిమితయమ్యే ప్యాసివ్‌ ఫండ్లూ ఉంటాయి. ఆ రంగానికి ఏదైనా ఇబ్బంది వచి్చనప్పుడు మొత్తం పోర్ట్‌ఫోలియో ప్రభావితం కావచ్చు. కావున దీర్ఘకాలంలోనే ఈ వ్యూహాల అసలు ప్రయోజనం బయటపడుతుంది. అందుకే తాత్కాలిక పనితీరును చూసి నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదు.

మొత్తంగా, స్మార్ట్‌ బీటా వ్యూహాలు అనేవి ప్యాసివ్‌ ఇన్వెస్టింగ్‌ సరళతను, నిర్దిష్ట నియమాల ఆధారిత వ్యూహాలను సమన్వయం చేసే ఆధునిక పెట్టుబడి విధానాలుగా అభివర్ణించవచ్చు. ఇవి విభిన్న ఫాక్టర్లను కలిపి పెట్టుబడిదారులకు స్థిరమైన ఆదాయాలు అందించగలవు. భవిష్యత్తులో భారత ప్యాసివ్‌ ఇన్వెస్టింగ్‌ ప్రయాణంలో స్మార్ట్‌ బీటా వ్యూహాలు కీలక పాత్ర పోషించనున్నాయి. మార్కెట్లు వృద్ధి చెందుతున్న దశలో ప్యాసివ్‌ ఫండ్లు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇచ్చేందుకు ఆస్కారం ఉంది.

ఇదీ చదవండి: ఉఫ్‌.. బిగ్‌ రిలీఫ్‌!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)