బ్రాంచ్‌ లేని బ్యాంక్‌ అకౌంట్లు..

Published on Thu, 12/25/2025 - 18:06

దేశంలో బ్యాంకింగ్ రంగం వేగంగా డిజిటల్ వైపు అడుగులు వేస్తోంది. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండానే, పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా ఖాతా తెరవగలిగే డిజిటల్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు ఇప్పుడు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఆధార్, పాన్ కార్డులు ఉంటే చాలు వీడియో-కేవైసీ సహాయంతో ఇంటి నుంచే ఖాతా ప్రారంభించే సౌకర్యాన్ని పలు బ్యాంకులు కల్పిస్తున్నాయి.

ఏయే బ్యాంకులు అందిస్తున్నాయంటే..

ప్రైవేట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఈ డిజిటల్ సేవలను ప్రధానంగా అందిస్తున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ తన కొటక్‌ 811 డిజిటల్ సేవింగ్స్ ఖాతా ద్వారా జీరో బ్యాలెన్స్ సౌకర్యాన్ని అందిస్తోంది. అలాగే యాక్సిస్ బ్యాంక్, యెస్‌ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ వంటి బ్యాంకులు కూడా పేపర్‌లెస్, బ్రాంచ్‌లెస్ ఖాతాలను అందుబాటులోకి తెచ్చాయి.

ఇదే విధంగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి బ్యాంకులు మొబైల్ యాప్ ఆధారంగా డిజిటల్ ఖాతా ప్రారంభించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ ఖాతాల ద్వారా యూపీఐ, ఐఎంపీఎస్‌, నెఫ్ట్‌, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వర్చువల్ డెబిట్ కార్డ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి.

అంతేకాకుండా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వంటి పేమెంట్స్ బ్యాంకులు కూడా డిజిటల్ సేవింగ్స్ ఖాతాలను అందిస్తున్నాయి. అయితే వీటిపై డిపాజిట్ పరిమితులు ఉండటంతో, వీటిని సంప్రదాయ బ్యాంక్ ఖాతాలకు పూర్తి ప్రత్యామ్నాయంగా పరిగణించలేము.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్ (BSBDA)కు డిజిటల్ సదుపాయాలను ప్రోత్సహిస్తూ, ఆర్థిక చేరికను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది.

డిజిటల్ బ్యాంకింగ్ వల్ల గ్రామీణ ప్రాంతాలు, యువత, ఉద్యోగుల్లో బ్యాంకింగ్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఆన్‌లైన్ మోసాల పట్ల కూడా కస్టమర్లు జాగ్రత్తలు వహించాచాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)