Breaking News

సీఈఓల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న బాడీగార్డ్స్

Published on Sun, 03/12/2023 - 19:06

సినీ ప్రముఖులకు, ప్రముఖ పారిశ్రామికవేత్తలకు, క్రికెటర్లకు సాధారణ ప్రజల మాదిరిగా బయట తిరిగే స్వేచ్ఛ ఉండదు, ఈ కారణంగా తమను తాము కాపాడుకోవడానికి బాడీగార్డ్స్‌ని నియమించుకుంటారు. ఈ బాడీగార్డ్స్‌ జీతాలు భారతదేశంలో ఉండే కొన్ని కంపెనీల సీఈఓల జీతాలకంటే ఎక్కువ అని తెలుస్తోంది.

షారుక్ ఖాన్ బాడీగార్డ్:

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో షారుక్ ఖాన్ అతిపెద్ద సూపర్‌స్టార్. అయితే ఈయన సినిమా షూటింగ్, ప్రమోషన్‌ వంటి వాటికోసం బయట ఎక్కువ తిరగాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో తనకు రక్షణగా రవి సింగ్ అనే బాడీగార్డ్‌ని నియమించుకున్నాడు. ఇండస్ట్రీలో ఎక్కువ జీతం తీసుకునే బాడీగార్డ్‌లలో రవి సింగ్ ఒకరు. ఈయన శాలరీ సంవత్సరానికి రూ. 2 నుంచి రూ. 3 కోట్లు వరకు ఉంటుంది.

సల్మాన్ ఖాన్ బాడీగార్డ్:

బాలీవుడ్ టాప్ పెర్ఫార్మర్లలో ఒకరైన సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ 'గుర్మీత్ సింగ్ జాలీ అకా షేరా' సంవత్సరానికి రూ. 2 కోట్లు కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నాడు. ఎక్కువ జీతం తీసుకునే బాడీగార్డ్‌లలో ఈయన ఒకరు. ముంబైలో జస్టిన్ బీబర్ తన సంగీత కచేరీ సమయంలో అతను ఎస్కార్ట్ చేశాడు.

అమీర్ ఖాన్ బాడీగార్డ్:

ఎన్నో పాపులర్ సినిమాలతో బాలీవుడ్ సీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న అమీర్ ఖాన్ కూడా తన బాడీగార్డ్‌కి ఎక్కువ జీతం ఇస్తున్నట్లు సమాచారం. యువరాజ్ ఘోర్పడే (అమీర్ ఖాన్ బాడీగార్డ్) ప్రతి సంవత్సరం 1 నుండి 2.5 కోట్లు సంపాదిస్తున్నాడు. నిజానికి యువరాజ్ బాడీబిల్డర్.

అక్షయ్ కుమార్ బాడీగార్డ్:

అక్షయ్ కుమార్ బాడీగార్డ్ 'శ్రేయ్‌సే తేలే' సంవత్సరానికి 1 నుంచి 2 కోట్లు సంపాదిస్తూ అత్యధిక శాలరీ తీసుకుంటున్న బాడీగార్డ్‌లలో ఒకరుగా నిలిచారు.

దీపికా పదుకొనే బాడీగార్డ్:

ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే బాడీగార్డ్ 'జలాల్' పబ్లిక్ ప్లేస్‌లో ఎప్పటికప్పుడు రక్షణ కల్పిస్తూ వారి కుటుంబ సభ్యులలో ఒకరుగా కలిసిపోయారు. ఈయన సంవత్సరాదాయం రూ. 90 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు ఉంటుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)