Miss World Contestants: ఇండియాకు రావటం అదృష్టంగా భావిస్తున్నా
Breaking News
గడువు సమీపిస్తోంది, ఖాతాదారులకు అలర్ట్: లేదంటే తప్పదు మూల్యం!
Published on Fri, 03/17/2023 - 10:35
సాక్షి, ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) తన కస్టమర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. మార్చి 24, 2023లోపు సెంట్రల్ కేవైసీ (C-KYC)ని పూర్తి చేయాలని తన వినియోగ దారులను కోరింది. అలా చేయకపోతే భారీ మూల్యం తప్పదని కూడా హెచ్చరించింది. ఈ మేరకు అధికారిక ట్విటర్‌లో ఒ కప్రకటన జారీ చేసింది.
నిర్ధేశిత సమయంలోపు బ్యాంకు వినియోగదారులు సెంట్రలైజ్డ్ నో యువర్ కస్టమర్ (సీ-కేవైసీ)ని పూర్తి చేయని పక్షంలో అకౌంట్ డీయాక్టివేట్ అవుతుందని తెలిపింది. ఇప్పటికే ఎస్‌ఎంఎస్, నోటీసులు సంబంధిత ఖాతాదారులకు పంపించామని, వెంటనే వారు సమీప ఖాతాను సందర్శించిన అవసరమైన పతత్రాలు సమర్పించాలని సూచించింది. మార్చి 24, 2023లోపు సెంట్రల్ KYC ప్రాసెస్‌ను పూర్తి చేయని కస్టమర్‌లు తమ ఖాతాలను యాక్సెస్ చేయడంలో ఇబ్బంది పడవచ్చు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది.
సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా (CERSAI) సీ-కేవైసీని నిర్వహిస్తుంది. దీంతో కస్టమరు బ్యాంకుకో, డీమ్యాట్ ఖాతాకో ఇలా ఏదో ఒకదానికి ఒకసారి నో యువర్ కస్టమర్ వివరాలిచ్చిన తరువాత డిజిటల్ ఫార్మాట్ సెంట్రలైజ్డ్ నంబరు కేటాయిస్తారు. కేవైసీ వివరాలకు ఈ నంబరు ఇస్తే సరిపోతుంది. అంటే కస్టమర్ ఒక్కసారి సీ-కేవైసీని పూర్తి చేశాక కొత్త ఖాతాలను తెరవడం, జీవిత బీమా, లేదా డీమ్యాట్ ఖాతా లాంటి విభిన్న ప్రయోజనాల కోసం మళ్లీ ప్రక్రియను కొనసాగించాల్సిన అవసరం లేదు. ఆ నంబరు తీసుకున్న ఆర్థిక సంస్థ ఆన్‌లైన్లో చెక్ చేసుకోవచ్చు. కేవైసీ ప్రాసెస్‌ను, కేవేసీ రికార్డ్‌లను సమర్థవంతంగా వినియోగించు కోవడం లక్ష్యాలుగా ‘సీ-కేవైసీ’ని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
— Bank of Baroda (@bankofbaroda) March 13, 2023
Tags : 1