Breaking News

7 లక్షల వాహనాలకు రీకాల్: బీఎండబ్ల్యూ కీలక ప్రకటన

Published on Sun, 10/20/2024 - 09:06

బీఎండబ్ల్యూ కంపెనీ చైనాలో దాదాపు 7,00,000 బ్రాండ్ వాహనాలకు రీకాల్ ప్రకటించింది. కార్లలోని కూలెస్ట్ పంపులో ఏర్పడిన సమస్య కారణంగా జర్మన్ కార్‌మేకర్‌ ఈ రీకాల్ ప్రకటించినట్లు సమాచారం. ఇందులో స్థానికంగా ఉత్పత్తి చేసిన కార్లు మాత్రమే కాకుండా.. దిగుమతి చేసుకున్న కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ వెల్లడించింది.

బీఎండబ్ల్యూ మోడళ్లలో అమర్చిన లోపభూయిష్ట కూలెస్ట్ పంప్ ప్లగ్‌లు తుప్పు పట్టే అవకాశం ఉంది. ఇది షార్ట్ సర్క్యూట్‌లకు కారణమైతే.. వాహనంలో మంటలు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి సమస్యకు సంబంధించిన ఫిర్యాదులు కంపెనీ దృష్టికి రాలేదు, కానీ కంపెనీ ముందు జాగ్రత్తగా రీకాల్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.

రీకాల్ ప్రకటించిన కార్లలో స్థానికంగా తయారైన బీఎండబ్ల్యూ 3 సిరీస్, 5 సిరీస్ వాహనాలు ఉన్నాయి. అలాగే దిగుమతి చేసుకున్న కార్లలో ఎక్స్ సిరీస్ కార్లు ఉన్నాయి. రీకాల్ కారణంగా కంపెనీ కార్ల సేల్స్ ప్రస్తుతం గణనీయంగా తగ్గింది. గత నాలుగు సంవత్సరాల్లో అమ్మకాలు భారీగా పడిపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

ఇదీ చదవండి: ఆ కంపెనీలో జాబ్ ఆఫర్ వదులుకున్న రతన్ టాటా: ఎందుకంటే..

కంపెనీ గత సెప్టెంబర్ నెలలో కూడా  కాంటినెంటల్ ఏజీ ద్వారా సరఫరా చేసిన కార్లలో బ్రేకింగ్ సిస్టమ్‌లలో సమస్య ఉందని గుర్తించి.. ప్రపంచ వ్యాప్తంగా 1.5 మిలియన్ కార్లకు రీకాల్ ప్రకటించింది. ఈ లోపాన్ని కంపెనీ సరి చేయడానికి ఏకంగా 1.1 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)