Breaking News

రూ.1.89 కోట్ల కొత్త బీఎండబ్ల్యూ కారు ఇదే.. పూర్తి వివరాలు

Published on Sun, 10/06/2024 - 12:42

బీఎండబ్ల్యూ కంపెనీ భారతదేశంలో 'ఎం4 సీఎస్' పేరుతో ఓ కొత్త కారును లాంచ్ చేసింది. దీని ధర రూ.1.89 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన మొట్ట మొదటి బీఎండబ్ల్యూ సీఎస్ మోడల్. ఎం4 కాంపిటీషన్ మోడల్ కంటే కూడా దీని ధర రూ. 36 లక్షలు ఎక్కువ.

కొత్త బీఎండబ్ల్యూ ఎం4 సీఎస్ స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే 3.0 లీటర్ ట్విన్ టర్బో స్ట్రెయిట్-సిక్స్ ఇంజిన్‌ పొందుతుంది. ఇది 550 హార్స్ పవర్, 650 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టర్బో బూస్ట్ ప్రెజర్ 1.7 బార్ నుంచి 2.1 బార్‌కి పెంచడం వల్ల పవర్ కొంత ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కారు 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టాప్ స్పీడ్ 302 కిమీ/గం.

బీఎండబ్ల్యూ ఎం4 సీఎస్.. టైటానియం ఎగ్జాస్ట్ సైలెన్సర్, సెంటర్ కన్సోల్, గేర్‌బాక్స్ ప్యాడిల్స్ వంటివి ఫైబర్ నిర్మితం. ఈ కారు ముందు భాగంలో 19 ఇంచెస్ అల్లాయ్స్, వెనుక 20 ఇంచెస్ అల్లాయ్స్ పొందుతుంది. ఎం4 సీఎస్ కారులో ఎల్లో కలర్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఉంటాయి. కిడ్నీ గ్రిల్ బార్డర్ ఎరుపు రంగులో ఉండటం చూడవచ్చు.

ఇదీ చదవండి: డిజిటల్ అరెస్ట్ అంటే తెలుసా?: తెలుసుకోకపోతే మోసపోతారు..

ఫ్లాట్ బాటమ్ ఆల్కాంటారా ఎం స్టీరింగ్ వీల్‌ కలిగిన ఎం4 మోడల్ 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ పొందుతుంది. సెంటర్ కన్సోల్‌లోని సీఎస్ ఎరుపు రంగులో ఉండటం చూడవచ్చు. ఈ కారు ఆడి ఆర్ఎస్5కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)