Breaking News

బీఎండబ్ల్యూ కార్లు.. రికార్డు స్థాయిలో విక్రయాలు

Published on Fri, 01/09/2026 - 14:09

జర్మనీ వాహన సంస్థ బీఎండబ్ల్యూ, మనదేశంలో గతేడాది రికార్డు స్థాయిలో కార్లు విక్రయించినట్లు తెలిపింది. 2025లో మొత్తం 18,001 కార్లను విక్రయించామని, ఇందులో 730 యూనిట్లు మినీ బ్రాండ్‌కు చెందినవని ఉన్నట్లు పేర్కొంది. అంతకుముందు ఏడాది(2024)15,723 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇవి 14% అధికం.

నూతన ఉత్పత్తుల ఆవిష్కరణలు, సులభతర ఫైనాన్సింగ్‌ అంశాలు విక్రయాలకు దన్నుగా నిలిచాయని కంపెనీ తెలిపింది. దేశీయ లగ్జరీ ఎలక్ట్రిక్‌ విభాగంలో అత్యధిక వాటా కలిగిన ఈ సంస్థ గతేడాదిలో 3,573 ఈవీ కార్లను విక్రయించింది.

    గ్రూప్‌ మొత్తంగా 2025లో 23,842 వాహనాలను విక్రయించామని.. ఇందులో బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్ల కార్లు 18,001 ఉండగా, బీఎండబ్ల్యూ మోటరాడ్‌ బైక్‌లు 5,841 ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్, బీఎండబ్ల్యూ మోటరాడ్‌ మూడు బ్రాండ్లలో కలిపి మొత్తం 20 కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది.

    ‘‘మునుపెన్నడూ లేనంతగా 2025లో 18,001 కార్లను విక్రయించి రికార్డు సృష్టించాము. వార్షిక ప్రాతిదికన అమ్మకాలు 14% వృద్ధి నమోదు కావడం లగ్జరీ కార్లపై కస్టమర్ల ఆసక్తిని ప్రతిబింబిస్తోంది’’ అని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ హర్మదీప్‌ సింగ్‌ బర్‌ తెలిపారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)