Breaking News

చదువుకునే రోజుల్లోనే పునాది.. తాత పేరుతో కంపెనీ - పునీత్ గోయల్ సక్సెస్ స్టోరీ

Published on Fri, 12/15/2023 - 16:53

క్యాబ్ సర్వీస్ అనగానే అందరికి ఓలా, ఉబర్ వంటివి మాత్రమే గుర్తొస్తాయి. ఈ కంపెనీలకు ధీటుగా పోటీ ఇస్తున్న బ్లూస్మార్ట్.. ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్‌ ప్రాంతాల్లో మంచి సక్సెస్ చవి చూస్తోంది. ప్రారంభంలో ఒడిదుడుకులను ఎదుర్కొని కంపెనీని ఈ రోజు ఈ స్థాయికి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన వారిలో ఒకరు, కంపెనీ కో-ఫౌండర్ 'పునీత్ గోయల్' గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

బ్లూస్మార్ట్ కో-ఫౌండర్ 'పునీత్ గోయల్' బ్లూస్మార్ట్ ప్రారంభించడానికి ముందే సొంత వెంచర్‌లను ప్రారంభించి, ఒకదాంట్లో విజయం పొందలేకపోయినట్లు గతంలోనే వెల్లడించారు. ప్రారంభంలో గుజరాత్‌లో 20 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను నెలకొల్పి, దానిని సౌదీ ప్లేయర్‌కు 68 మిలియన్ డాలర్లకు, మహారాష్ట్రలోని మరో 70 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను 55 మిలియన్ డాలర్లకు విక్రయించినట్లు గోయల్ తెలిపారు. 

పునీత్ గోయల్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, బర్మింగ్‌హామ్‌లోని ఆస్టన్ బిజినెస్ స్కూల్ నుంచి డబుల్ మాస్టర్స్ పూర్తి చేసి ఆ తరువాత గ్రీన్ ఎనర్జిలోకి ప్రవేశించారు. క్లీన్ ఎనర్జీ ఆలోచన తన జీవితాన్ని మార్చేసినట్లు గోయల్ ఒక సందర్భంలో వెల్లడించారు.

బర్మింగ్‌హామ్‌లో చదువుకునే రోజుల్లో గోయల్ క్లీన్ ఎనర్జీ గురించి చదివినట్లు, ఇది తప్పకుండా భవిష్యత్తులో ఉపయోగపడుతుందని భావించి.. భారతదేశంలో సోలార్ ఫ్యానెల్ తయారీదారులను కలుసుకుని కొన్ని మెళుకువలు తెలుసుకున్నారు. ఆ సమయంలో భారతదేశంలో సోలార్ ఫ్యానెల్స్ తయారు చేసి, ఐరోపాకు ఎగుమతి చేయడానికి మంచి అవకాశం ఉన్నట్లు తెలుసుకున్నారు.

గోయల్ చదువు పూర్తయ్యే సమయానికి సోలార్ ఎనర్జీ అనేది అతి పెద్ద మార్కెట్. దీనిని అదనుగా తీసుకుని, సోలార్ ప్యానెల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించి.. అతని తాత 'పురుషోత్తమ్ లాల్ గోయల్' పేరు మీదుగా PLG పవర్ ఏర్పాటు చేసాడు. 2008లో ప్రారంభమైన కంపెనీ 2012 వరకు సజావుగా ముందుకు సాగింది. ఆ తరువాత యూరప్‌లో సోలార్ ప్యానెల్ మార్కెట్ పడిపోవడంతో నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. దీంతో మొదటి వెంచర్ మూసివేయాల్సి వచ్చింది.

మొదటి వెంచర్ మూసివేసిన తరువాత, గుజరాత్ ప్రభుత్వం సోలార్ పాలసీని తీసుకురావడంతో మరో సువర్ణావకాశం లభించింది. ఆ సమయంలో 2 MW పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి.. దానిని రెండు సంవత్సరాలు నిర్వహించి, ఆ తరువాత ఒక పెద్ద సౌదీ కంపెనీకి విక్రయించేశారు.

బ్లూస్మార్ట్ ఆలోచన..
రెండు వెంచర్లు ప్రారంభించి విక్రయించిన తరువాత.. హైపర్‌లూప్ వన్ సీఈఓ షెర్విన్ పిషెవార్.. వర్జిన్ హైపర్‌లూప్ సీఈఓ బ్రెంట్ కల్లినికోస్‌ను లాస్ వెగాస్‌లో కలిసిన తరువాత ఈ బ్లూస్మార్ట్ ఆలోచన వచ్చినట్లు గోయల్ తెలిపాడు.

2019లో ప్రారంభమైన బ్లూస్మార్ట్ భారతదేశంలోని మొదటి ఆల్ ఎలక్ట్రిక్ షేర్డ్ స్మార్ట్ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్. ఇందులో ఎంజి జెడ్ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్, టాటా ఎలక్ట్రిక్ కాలు, మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను బ్లూస్మార్ట్‌లో ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: అనిల్ అంబానీ ఆస్తులు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్.. జాబితాలో ఉన్నవేంటో తెలుసా?

క్లీన్ మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్పేస్‌లో పునీత్ గోయల్ చేసిన కృషికి జనవరి 2023లో UK ప్రభుత్వం, బ్రిటిష్ కౌన్సిల్, NISAU UK 'ఇండియా-UK 75 ఎట్ 75 అచీవర్స్' అవార్డును, జూలై 2022లో UKలోని ఆస్టన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అందించింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)