Breaking News

ఐపీవోకు బ్లూస్టోన్‌ జ్యువెలరీ

Published on Sat, 12/14/2024 - 09:45

వజ్రాల ఆభరణ రిటైలర్‌ బ్లూస్టోన్‌ జ్యువెలరీ అండ్‌ లైఫ్‌స్టైల్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. కంపెనీ ప్రధానంగా బ్లూస్టోన్‌ బ్రాండుతో డైమండ్, గోల్డ్, ప్లాటినం, స్టడ్డెడ్‌ జ్యువలరీ విక్రయిస్తోంది. 

ప్రాస్పెక్టస్‌ ప్రకారం ఐపీవోలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 2.4 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. కళారి క్యాపిట ల్, సామా క్యాపిటల్, సునీ ల్‌ కాంత్‌ ముంజాల్‌ తది తరులు షేర్లను ఆఫర్‌ చేయనున్నారు. 

ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 750 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీలో ప్రస్తుతం ఇన్వెస్టర్లకు 26.82 శాతం వాటా ఉంది. కంపెనీ దేశవ్యాప్తంగా 203 స్టోర్లను నిర్వహిస్తోంది. గతేడాది(2024–25) మొత్తం ఆదాయం 64 శాతం జంప్‌చేసి రూ. 1,266 కోట్లకు చేరింది.

ఇదీ చదవండి: ఐపీవో వేవ్‌.. ఇన్వెస్టర్ల క్యూ

మరోవైపు ప్యాకేజింగ్‌ మెషినరీ తయారీలో కార్యకలాపాలు నిర్వహించే గుజరాత్‌ కంపెనీ ‘మమతా మెషినరీ లిమిటెడ్‌’ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో) ఈ నెల 19న ప్రారంభం కానుంది. ఒక్కో షేరుకు రూ.230–243 ధరల శ్రేణిని ప్రకటించింది. ఈ మేరకు రూ.179 కోట్ల నిధులు సమీకరించనుంది. ఈ నెల 23న ఇష్యూ ముగుస్తుంది. ఈ నెల 18న యాంకర్‌ ఇన్వెస్టర్ల బిడ్లు స్వీకరించనుంది. 50 శాతం సంస్థాగత ఇన్వెస్టర్లకు, 35 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లకు, 15 శాతం కోటాను నాన్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు రిజర్వ్‌ చేశారు. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)