10 నిమిషాల్లో యాపిల్‌ ఉత్పత్తుల డెలివరీ

Published on Fri, 02/28/2025 - 18:07

క్విక్‌ కామర్స్‌ రంగంలో ఉన్న బ్లింకిట్‌ (Blinkit) 10 నిమిషాల్లో యాపిల్‌ (Apple) ఉత్పత్తుల డెలివరీ సేవలను ప్రారంభించింది. మ్యాక్‌బుక్‌ ఎయిర్, ఐప్యాడ్, ఎయిర్‌పాడ్, యాపిల్‌ వాచ్, యాక్సెసరీస్‌ను కస్టమర్లు బ్లింకిట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, పుణే, లక్నో, అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, జైపూర్, బెంగళూరు, కోల్‌కతలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.  కాగా గత ఏడాది యాపిల్ ప్రీమియం రీసెల్లర్ యూనికార్న్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని ఆర్డర్లు ఇచ్చిన 10 నిమిషాల్లోనే ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌ ఫోన్‌లను కస్టమర్లకు డెలివరీ చేసింది.

అంతకుముందు బ్లింకిట్ పైలట్ ప్రాజెక్టుగా గురుగ్రామ్‌లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో 10 నిమిషాల అంబులెన్స్ సేవలను ప్రారంభించింది. ఈ అంబులెన్సుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, ఏఈడీ (ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్), స్ట్రెచర్, మానిటర్, సక్షన్ మెషీన్, అత్యవసర మందులు, ఇంజెక్షన్లు వంటి అవసరమైన ప్రాణరక్షణ పరికరాలు ఉంటాయి.

జొమాటోకు చెందిన ఈ క్విక్‌ కామర్స్‌ బిజినెస్‌ 2024 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.103 కోట్ల నష్టాన్ని చవిచూసింది. పెట్టుబడుల కారణంగా బ్లింకిట్ కింద క్విక్ కామర్స్ వ్యాపారంలో నష్టాలు సమీపకాలంలో కొనసాగుతాయని కంపెనీ భావిస్తోందని షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో జొమాటో పేర్కొంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)