Breaking News

ఇది సక్సెస్‌ కాదు.. గిగ్‌ కార్మికుల గొడ్డు చాకిరీ!

Published on Wed, 12/17/2025 - 11:57

క్విక్ కామర్స్ కంపెనీలు గిగ్ కార్మికుల శ్రమను దోచుకుంటున్న వైనంపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆగ్రహం వ్యక్తం చేశారు. గిగ్ కార్మికుల ఇబ్బందులను ఇటీవల ఆయన పార్లమెంటులో ప్రస్తావించారు. ఆ మధ్య వైరల్ అయిన ఒక వీడియోను ఉదహరిస్తూ సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో  తాజాగా పోస్ట్‌ చేశారు.

ఇందులో బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ శ్రమ దోపిడీకి గురైన వైనాన్ని వివరించారు. రోజంతా దాదాపు 15 గంటలు గొడ్డులా కష్టపడి 28 ఆర్డర్లు డెలివరీలు చేస్తే అతనికి లభించింది కేవలం రూ .763 మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పార్లమెంటులో ఈ సమస్యను లేవనెత్తిన చద్దా.. "అధిక పని", "తక్కువ వేతనం"తో కార్మికులు పడుతున్న ఇబ్బందులపై దేశం డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించలేదని స్పష్టం చేశారు.

‘ఇది గిగ్ ఎకానమీ విజయ గాథ కాదు.. డెలివరీ యాప్‌లు, వాటి అల్గోరిథంల వెనుక దాగి ఉన్న వ్యవస్థీకృత దోపిడీ’ అని అభివర్ణించిన చద్దా.. ప్రతి రోజూ లక్షలాది మంది ​కార్మికులు ఎంత శ్రమ దోపిడీకి గురవుతున్నారో ఈ ఒక్క బ్లింకిట్‌ ఉదంతం తెలియజేస్తోందంటూ ట్వీట్ చేశారు. డిజిటల్ ప్లాట్ ఫామ్‌లు వేగంగా విస్తరించినప్పటికీ, కార్మికుల రక్షణ మాత్రం విస్మరణకు గురవుతోందన్నారు.

రాఘవ్ చద్దా పోస్ట్ ‘ఎక్స్’లో విస్తృత చర్చకు దారితీసింది. కార్మిక చట్టాలు కేవలం కాగితాలపై మాత్రమే ఉన్నాయని పలువురు వ్యాఖ్యానించారు. గిగ్ కార్మికుల పట్ల "క్రూరత్వం" నివారించడానికి 10 నిమిషాల డెలివరీ సేవలను నిషేధించాలని ఆప్ ఎంపీ గతంలోనే కోరారు. కఠినమైన సమయపాలనను చేరుకోవడానికి కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)