Breaking News

భారత్‌లో పెట్టుబడులు రెట్టింపు

Published on Fri, 03/14/2025 - 09:46

ముంబై: ప్రైవేట్‌ ఈక్విటీ పెట్టుబడుల దిగ్గజం బ్లాక్‌స్టోన్‌ దేశీయంగా ఇన్వెస్ట్‌మెంట్‌ను రెట్టింపు చేయబోతున్నట్లు తెలియజేసింది. మౌలిక రంగం, క్రెడిట్‌ బిజినెస్‌ల్లో తాజాగా పెట్టుబడులు చేపట్టనున్నట్లు పేర్కొంది. దేశీయంగా బ్లాక్‌స్టోన్‌ 50 బిలియన్‌ డాలర్లకుపైగా పెట్టుబడులు కలిగి ఉంది. ఈ బాటలో పెట్టుబడులను 100 బిలియన్‌ డాలర్ల(రూ.8.7 లక్షల కోట్లు)కు చేర్చనున్నట్లు బ్లాక్‌స్టోన్‌ తెలియజేసింది. కాగా.. యూఎస్‌ టారిఫ్‌లను ఇండియా సమర్ధవంతంగా ఎదుర్కోగలదని సంస్థ ఛైర్మన్‌ స్టీఫెన్‌ ఏ ష్వార్జ్‌మ్యాన్‌ అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: ఆరేళ్లలో ఆస్తులమ్మి రూ.12,985 కోట్లు సమీకరణ

రెండు దశాబ్దాల పెట్టుబడి ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా భారత్‌లోనే అధిక రిటర్నులు అందుకున్నట్లు ష్వార్జ్‌మ్యాన్‌ వెల్లడించారు. దేశీయంగా పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రహదారి ఆస్తుల్లో ఇన్వెస్ట్‌ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. ష్వార్జ్‌మ్యాన్‌ గతంలో ప్రస్తుత యూఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌నకు సలహాదారుడిగా వ్యవహరించారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ, ట్రంప్‌ మధ్య అర్ధవంతమైన సమావేశం జరిగిందని, వాణిజ్య ఒప్పందంపై ఇరు నేతలు అంగీకారానికి వచ్చారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటికే భారత్‌ అధిక టారిఫ్‌ల అంశంపై కొన్ని సవరణలు చేపట్టినట్లు పేర్కొన్నారు. దేశీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయని, 6 శాతానికంటే తక్కువ వృద్ధి నమోదయ్యే అవకాశంలేదని అభిప్రాయ పడ్డారు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)