Breaking News

మైండ్‌ బ్లోయింగ్‌ శాలరీ.. ఏడాదిలో రూ.7,400 కోట్లు!

Published on Sat, 02/24/2024 - 21:51

Blackstone CEO Payout : సీఈవోల వేతనాల గురించి మనం తరచూ వింటుంటాం. అయితే అమెరికాకు చెందిన ప్రైవేటు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ కంపెనీ బ్లాక్‌స్టోన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) స్టీవ్ స్క్వార్జ్‌మాన్ (Steve Schwarzman) ఏడాదిలో తీసుకున్న వేతనం గురించి తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. 

బ్లాక్‌స్టోన్ సీఈవో స్టీవ్ స్క్వార్జ్‌మాన్ గత సంవత్సరం రూ.896.7 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.7,400 కోట్లు) వేతనం అందుకున్నారు. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 30 శాతం తగ్గినప్పటికీ ఫైనాన్ రంగంలో అతిపెద్ద వార్షిక చెల్లింపులలో ఒకటి. 

కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. 77 ఏళ్ల స్క్వార్జ్‌మాన్ కంపెనీలో తన సుమారు 20 శాతం వాటా నుంచి డివిడెండ్‌ల రూపంలోనే 777 మిలియన్‌ డాలర్లు (రూ.6,400 కోట్లు) అందుకున్నారు. అదనంగా 120 మిలియన్‌ డాలర్లు (రూ.990 కోట్లు)ప్రోత్సాహక రుసుములు, క్యారీడ్‌ వడ్డీగా అని పిలిచే ఫండ్ లాభాల వాటా ద్వారా సంపాదించారు. కాగా స్క్వార్జ్‌మాన్ 2022లో రికార్డు స్థాయిలో 1.27 బిలియన్‌ డాలర్లు అందుకున్నారు.

స్క్వార్జ్‌మాన్ వాటాలు, డివిడెండ్‌లు ఇప్పటికీ ఆయనను ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకడిగా స్థిరపరుస్తున్నాయి. ఆయన అదృష్టం తాను సహ స్థాపించిన సంస్థతో ముడిపడి ఉంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం స్క్వార్జ్‌మాన్  నెట్‌వర్త్‌ 41.8 బిలియన్‌ డాలర్లు (రూ.3.4 లక్షల కోట్లు).

Videos

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

Photos

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం