Breaking News

బయోఏషియా 2025: ఒకే వేదికపై 80 సంస్థలు

Published on Wed, 02/19/2025 - 19:39

ఆసియాలో అతిపెద్ద లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్‌కేర్ సమావేశమైన 'బయోఏషియా 2025' (BioAsia 2025) ఫిబ్రవరి 25, 26 తేదీలలో హైదరాబాద్‌లో జరగనుంది. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి ఎంపిక చేసిన సుమారు 80 స్టార్టప్‌ బృందాలు పాల్గొంటాయి. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణను మార్చగల సామర్థ్యం ఉన్న.. వినూత్న పరిష్కారాలను ప్రదర్శిస్తాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బయోఏషియా 2025 ఈవెంట్‌లో పరిశ్రమల దిగ్గజాలతో ప్రత్యేకమైన సంభాషణలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమం జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఆసక్తిని ఆకర్శించింది. దీంతో ప్రపంచ నలుమూలల నుంచి కంపెనీలు తమ ఆవిష్కరణలను ప్రదర్శించనున్నాయి. అంతేకాకుండా.. స్టార్టప్‌ల వృద్ధికి కావాల్సిన అవకాలు కూడా ఇక్కడ లభించే అవకాశం ఉంది.

బయోఏషియా 2025లో పాల్గొనడానికి స్టార్టప్‌ల నుంచి వచ్చిన ప్రతిస్పందనకు చాలా సంతోషిస్తున్నాము. బయోఏషియా లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్‌కేర్ రంగాలలో ఆవిష్కరణ, సహకారాన్ని పెంపొందించే ప్రపంచ వేదిక సిద్ధంగా ఉంది. ఇది తెలంగాణను ఈ రంగంలో ప్రపంచ నాయకుడిగా నిలబెట్టడానికి, స్టార్టప్‌లు ప్రపంచ వేదికపై అభివృద్ధి చెందడానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని.. మంత్రి డీ శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

ఐటీ & పరిశ్రమల కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగం వేగంగా అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై ఆసక్తిని ఎదుర్కొంటున్నారని అన్నారు. దీనిని మరింత అభివృద్ధి చేయడానికి బయోఏషియా 2025 ప్రారంభించినట్లు వెల్లడించారు.

బయోఏషియా 2025లో పాల్గొనడానికి దేశీయ, అంతర్జాతీయ వెంచర్లు పోటీ పడ్డాయి. ఇందులో సుమారు 700 వినూత్న స్టార్టప్ వెంచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే  పరిశ్రమలు, విద్యాసంస్థలకు ప్రాతినిధ్యం వహించే అనుభవజ్ఞులైన నిపుణుల బృందం ఈ వేదికలో ప్రదర్శన కోసం సుమారు 80 స్టార్టప్‌లను షార్ట్‌లిస్ట్ చేసింది. ఇందులో కూడా ఉత్తమ ఐదింటికి అపూర్వ గౌరవం లభించనున్నట్లు సమాచారం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)