Breaking News

BioAsia 2024: ప్రతిష్టాత్మకంగా బయోఏషియా సదస్సు

Published on Thu, 01/11/2024 - 19:38

బయోఏషియా-2024 సదస్సు 21వ ఎడిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. 

హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొనే ఈ సదస్సు సన్నాహాలను తెలంగాణ సమాచార సాంకేతిక, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం సమగ్రంగా సమీక్షించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్, బయోఏషియా సీఈవో శక్తి నాగప్పన్‌ తదితరులు పాల్గొన్నారు.

బయో ఏషియా సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత పెరుగుతుండటంపై మంత్రి శ్రీధర్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. గత రెండు దశాబ్దాలుగా భారతీయ,  గ్లోబల్ లైఫ్-సైన్సెస్, అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి బయోఏషియా కీలక సాధనంగా ఉద్భవించిందన్నారు. అంతర్జాతీయ వేదికపై ఈవెంట్‌ ప్రాముఖ్యత పెంచడంతో అనేక మంది గ్లోబల్ సీఈవోలు మొదటిసారిగా బయోఏషియాకు హాజరవుతున్నారని ప్రకటించేందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు.

‘డేటా & ఏఐ: రీడిఫైనింగ్ పాసిబిలిటీస్‌’ అనే థీమ్‌తో జరగనున్న బయో ఏషియా 21వ ఎడిషన్‌లో ప్రభుత్వ, పారిశ్రామిక ప్రముఖులు, పరిశోధకులు, వ్యవస్థాపకులు, ఇతర ప్రతినిధులు పాల్గొంటున్నారు. గ్లోబల్ సీఈవోలు,  ఇండస్ట్రీ లీడర్‌లతో సహా 70 మందికిపైగా ప్రభావవంతమైన వక్తలు ప్రసంగించనున్నారు. భారీ స్థాయిలో జరిగే ఈ సదస్సులో 50 దేశాలకు చెందిన 3000 మందికిపైగా ప్రముఖులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈవెంట్‌లో  ఈసారి 200కిపైగా కంపెనీలు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాయి.

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?