Breaking News

బిన్నీ బన్సల్ కూడా.. ఫ్లిప్‌కార్ట్‌ నుంచి ఫౌండర్లు ఇద్దరూ అవుట్‌!

Published on Sat, 01/27/2024 - 14:33

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మరో పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ ఫ్లిప్‌కార్ట్‌ బోర్డు నుంచి అధికారికంగా రాజీనామా చేశారు. స్టార్టప్‌లో తన మిగిలిన వాటాను విక్రయించిన కొన్ని రోజుల తర్వాతే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

సచిన్ బన్సాల్ బాటలోనే..
నవీ అనే ఫిన్‌టెక్ వెంచర్‌ ఏర్పాటు కోసం కొన్ని సంవత్సరాల క్రితం ఫ్లిప్‌కార్ట్‌ను విడిచిపెట్టిన మరో సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ అడుగుజాడలనే బిన్నీ బన్సల్‌ కూడా అనుసరించనున్నారని ఇంతకు ముందే పలు నివేదికలు పేర్కొన్నాయి. ఆయన కూడా ఈ-కామర్స్ రంగంలో మరో వెంచర్‌ను ఏర్పాటు చేస్తారని, అందుకే ఆయన ఫ్లిప్‌కార్ట్‌ నుంచి తప్పుకొన్నారని భావిస్తున్నారు.

గత 16 సంవత్సరాలుగా ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సాధించిన విజయాల పట్ల బిన్నీ బన్సల్ గర్వాన్ని వ్యక్తం చేశారు. సమర్థవంతమైన నాయకత్వ బృందంతో కంపెనీ బలమైన స్థానంలో ఉందన్నారు. "ఈ నమ్మకంతో, కంపెనీ సమర్థుల చేతుల్లో ఉందని తెలుసుకుని, నేను పక్కకు తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ బృందం కస్టమర్‌లకు మెరుగైన అనుభవాలను అందించడాన్ని ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను. సంస్థకు బలమైన మద్దతుదారునిగా కొనసాగుతాను" అని బిన్నీ బన్సల్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఫ్లిప్‌కార్ట్‌తో దేశంలో షాపింగ్ అనుభవాన్ని మెరుగ్గా మార్చిన బిన్నీ బన్సల్‌ గొప్ప ఆలోచనలను ఫ్లిప్‌కార్ట్ సీఈవో, బోర్డ్ మెంబర్ అయిన కళ్యాణ్ కృష్ణమూర్తి కొనియాడారు. అంకితభావంతో కూడిన టీమ్‌వర్క్‌ వల్లే ఫ్లిప్‌కార్ట్‌ ఈ స్థాయికి ఎదిగిందన్నారు. ఫ్లిప్‌కార్ట్‌ను బెంగళూరు ప్రధాన కేంద్రంగా 2007లో సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ ప్రారంభించారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)