Breaking News

జీవిత పాఠాలు నేర్పిన గురువులు

Published on Thu, 09/05/2024 - 10:55

మీలో ఆశలు రేకిత్తించి వాటిని సాధించేందుకు ఓదారి చూపే ప్రతి వ్యక్తి గురువే. అలా అందరి జీవితాల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది గురువులు తారసపడుతారు. అలాంటి వారి సలహాలు, సూచనలు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడుతాయి. అలా గురువుల సాయంతో కొందరు వ్యాపారాల్లో స్థిరపడి మరెందరికో ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి వ్యాపార దిగ్గజాలు తమ గురువుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.

వారెన్‌బఫెట్‌

జీవితంలో కష్టనష్టాలు వారెన్‌బఫెట్‌కి అనేక పాఠాలు నేర్పాయి. తన తండ్రి హోవార్డ్ బఫెట్, కోచ్‌ బెంజమిన్ గ్రాహం, భార్య సుసాన్ బఫెట్ నుంచి ఎన్నో ఆర్థికపాఠాలు నేర్చుకున్నట్లు ఆయన చెప్పారు. సొంతంగా డబ్బు సంపాదించడం ఎలాగో తన తండ్రి నుంచి నేర్చుకున్నట్లు తెలిపారు. పెట్టుబడి నిర్వహణకు సంబంధించిన ఎన్నో విషయాలు ఆయన నేర్పించారని పేర్కొన్నారు.

బిల్‌గేట్స్‌

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ తనకు వారెన్‌బఫెట్‌ ఎన్నో విషయాల్లో మార్గనిర్దేశం చేశారని చెప్పారు. హార్వర్డ్‌ యూనివర్సిటీలో మధ్యలో చదువు మానేసిన తర్వాత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఆ సమయంలో వారెన్‌బఫెట్‌ దీర్ఘకాల లక్ష్యాలతో డబ్బు ఎలా సంపాదించాలో నేర్పించినట్లు చెప్పారు.

జెఫ్‌బెజోస్‌

అమెజాన్‌ వ్యవస్థాపకులు జెఫ్‌బెజోస్‌ వారెన్‌బఫెట్‌, జేపీ మోర్గాన్ ఛైర్మన్ జామీ డిమోన్, డిస్నీ సీఈఓ బాబ్ ఇగర్‌లను తన గురువులుగా భావిస్తున్నట్లు చెప్పారు. వారెన్‌బఫెట్‌ తన పుస్తకాల్లో ఎన్నో విషయాలు పంచుకుంటారని, దాదాపు అన్నింటిని చదవడానికి ఇష్టపడతానని బెజోస్‌ అన్నారు. సంక్షిష్టమైన కంపెనీ ద్వారా పెట్టుబడి పెడుతూ డబ్బు ఎలా సంపాదించాలో డిమోన్‌ను చూసి నేర్చుకోవాలన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలను ఎలా నెరవేర్చుకోవాలో ఇగర్‌ ద్వారా తెలుసుకున్నానని చెప్పారు.

ఇలాన్‌మస్క్‌

ఎక్స్‌(ట్విటర్‌), టెస్లా, స్పేస్‌ఎక్స్‌ వంటి కంపెనీల అధినేత ఇలాన్‌మస్క్‌ స్పేస్‌ఎక్స్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ జిమ్‌ కాంట్రెల్‌ను గురువుగా భావిస్తారు. మస్క్‌ కంపెనీలో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు కాంట్రెల్‌ మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్‌జాబ్స్‌ పుస్తకాలు ఇప్పటికీ చదువుతున్నట్లు మస్క్‌ చెప్పారు. అవి తనకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయని వివరించారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్, నికోలా టెస్లా, థామస్ ఎడిసన్, ఐసాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ పుస్తకాలు ఎంతో ప్రేరణ ఇస్తాయన్నారు.

ఇదీ చదవండి: 2.75 లక్షల ఫోన్‌ నంబర్లకు చెక్‌

మార్క్ జుకర్‌బర్గ్

మెటా వ్యవస్థాపకులు మార్క్ జుకర్‌బర్గ్ యాపిల్‌ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్‌ను ఎంతో ఆరాధించేవారు. మేనేజ్‌మెంట్‌ నిర్వహణతోపాటు కంపెనీకి ప్రత్యేకంగా బ్రాండింగ్‌ ఎలా తీసుకురావాలో స్టీవ్‌ దగ్గరి నుంచి నేర్చుకున్నట్లు మార్క్‌ తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)