Breaking News

ఆ 'కల' కోసం కాలేజీ వదిలేసి.. చివరకు..

Published on Sun, 09/15/2024 - 16:24

మైక్రొసాఫ్ట్ కో-ఫౌండర్.. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరైన 'బిల్ గేట్స్' గురించి అందరికి తెలుసు. అయితే తన కలలను సాకారం చేసుకోవడానికి చదువుకునే రోజుల్లోనే ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

బిల్ గేట్స్ చదువుకునే రోజుల్లో.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడానికి కాలేజీ విద్యను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని వెల్లడించారు. నిజానికి బిజినెస్ చేయాలనే ఉద్దేశ్యంతో కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసిన వ్యక్తుల జాబితాలో బిల్ గేట్స్ మాత్రమే కాకుండా.. స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్‌బర్గ్, ఇలాన్ మస్క్ మొదలైనవారు ఉన్నారు.

ప్రతి ఇంట్లోని డెస్క్‌పైన కంప్యూటర్ కలిగి ఉండాలి అనేది బిల్ గేట్స్ కల. ఈ వైపుగానే అడుగులు వేశారు. నేడు ఆ కల నిజమైంది. ప్రారంభంలో తాను హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చినప్పుడు బిలియనీర్ అవుతానని ఊహించలేదని అన్నారు.

ఇదీ చదవండి: సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే..    

1970లలో బిల్ గేట్స్ అతని స్నేహితుడు పాల్ అలెన్ కంప్యూటర్‌లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పట్టు వదలకుండా దీనిపైనే శ్రమించారు. తన 20వ ఏట మొత్తం మైక్రోసాఫ్ట్‌ కోసం పనిచేసినట్లు గేట్స్ చెప్పారు. వారాంతాలు, సెలవులు వంటివన్నీ మరచిపోయే అనుకున్న లక్ష్యం దిశగానే అడుగులు వేశారు. అనుకున్నది సాధించారు. నేడు మైక్రోసాఫ్ట్ వాల్యూ సుమారు మూడు ట్రిలియన్ డాలర్లు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)