Breaking News

మైక్రోసాఫ్ట్‌ కిచిడీ రెడీ! బిల్‌ గేట్స్‌కు స్మృతి ఇరానీ వంట పాఠాలు

Published on Fri, 03/03/2023 - 22:21

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ ఈ మధ్య భారతీయ వంటలపై ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రోటీలు తయారు చేస్తూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశారు. తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దగ్గర కిచిడీకి పోపు (తడ్కా) ఎలా పెట్టాలో నేర్చుకున్నారు. ఆ వీడియోను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్విటర్‌లో షేర్‌ చేశారు.  

అత్యంత పోషక విలువలు ఉన్న భారతీయ సూపర్ ఫుడ్ కిచిడీకి బిల్‌గేట్స్‌ పోపు(తడ్కా) పెట్టారు అంటూ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.  పోషణ్‌ అభియాన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిల్‌గేట్స్‌ పాల్గొన్నారు. ఈ వీడియోలో కిచిడీకి పోపు(తడ్కా) ఎలా పెట్టాలో  బిల్ గేట్స్‌కు స్మృతి ఇరానీ నేర్పించారు. బిల్‌ గేట్స్‌ కూడా స్వయంగా దినుసులు వేసి గరిటెతో కలియపెట్టారు. అంతా పూర్తయ్యాక కిచిడీని రుచి చూశారు. 

ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి ఒక రోజులో దాదాపు నాలుగు లక్షల మంది వీక్షించారు.  దాదాపు 10 వేల లైక్‌లు, అనేక కామెంట్‌లు వచ్చాయి. ఇప్పుడు ఈ కిచిడీని మైక్రోసాఫ్ట్ కిచిడీ అని పిలుస్తామంటూ పలువులు యూజర్లు చమత్కరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)