Breaking News

బైక్‌ ట్యాక్సీ సేవలు పునరుద్ధరణ

Published on Fri, 08/22/2025 - 10:21

కర్ణాటక హైకోర్టు బెంగళూరులో బైక్ ట్యాక్సీ సేవలపై నిషేధాన్ని ఎత్తివేసింది. దాంతో రాపిడో, ఉబర్‌, ఓలా వంటి ఆన్‌లైన్‌ రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌లు రాష్ట్రంలో తమ బైక్ ట్యాక్సీ సేవలను తిరిగి ప్రారంభించాయి. నెలరోజుల్లోగా బైక్ ట్యాక్సీ పాలసీని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

కర్ణాటకలో, ముఖ్యంగా బెంగళూరులో బైక్ ట్యాక్సీ సేవలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఉబర్, ఓలా, రాపిడో వంటి ఆన్‌లైన్‌ అగ్రిగేటర్‌ ప్లాట్‌ఫామ్‌లు అందించే బైక్ ట్యాక్సీపై నిషేధం విధిస్తూ 2025 జూన్ 16న రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. మోటారు వాహన చట్టం 1988 ప్రకారం బైక్ ట్యాక్సీ సేవలు చట్టవిరుద్ధమని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇది రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ హైకోర్టు ఉత్తర్వులను రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌లు సవాలు చేశాయి.

నిషేధాన్ని ఎత్తివేసిన కోర్టు

రాపిడో, ఓలా, ఉబర్ సంస్థల అప్పీలును జస్టిస్ విభూ బఖ్రూ, జస్టిస్ సీఎం జోషిలతో కూడిన ధర్మాసనం విచారించింది. బైక్ ట్యాక్సీలు చట్టబద్ధమైన వ్యాపారమని, వీటిపై నిషేధం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. బైక్ ట్యాక్సీలపై నిషేధం ఏకపక్షం, అసమంజసం, ఆర్టికల్ 14, 19(1)(జి)లను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. బైక్ ట్యాక్సీ పాలసీని రూపొందించేందుకు ప్రభుత్వానికి నెల రోజులు గడువు ఇచ్చింది.

బైక్ ట్యాక్సీల అవసరం

టెక్ హబ్ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరులో రోడ్డు మౌలిక సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అంతే కాదు, ప్రజా రవాణా వసతులు ఆశించినమేరకు లేకపోవడం వల్ల ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లడం సవాలుగా మారుతుంది. ఇలాంటి సమయంలో బైక్ ట్యాక్సీ సర్వీసులు ఎంతో ఉపయోగపడుతున్నాయనే వాదనలున్నాయి. ఒక్క బెంగళూరు మాత్రమే కాదు.. అభివృద్ధి చెందుతున్న చాలా నగరాలకు బైక్ సర్వీసులు అవసరం అవుతున్నట్లు కొందరు చెబుతున్నారు.

ఇదీ చదవండి: ఇవాళ, రేపు హెచ్‌డీఎఫ్‌సీ సర్వీసుల్లో అంతరాయం

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)