Breaking News

తల్లిదండ్రులకు అలర్ట్.. పిల్లల ఆధార్‌పై బిగ్ అప్డేట్!

Published on Sun, 08/23/2026 - 20:24

పిల్లలకు ఆధార్ కార్డు ఉంది అంటే.. మాత్రమే సరిపోదు. వాళ్లు పెరుగుతున్న కొద్దీ.. ఆధార్‌లోని బయోమెట్రిక్ వివరాలను కూడా తప్పకుండా అప్‌డేట్ చేయాలి. చిన్న పిల్లలకు ఆధార్ తీసుకునే సమయంలో వేలిముద్రలు, కంటి ఐరిస్ వివరాలు నమోదు చేయరు. కాబట్టి, పిల్లలకు 5 ఏళ్లు వచ్చిన తర్వాత వీటిని అప్‌డేట్ చేయడం తప్పనిసరి.

ఇటీవల యూఐడీఏఐ దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో 2 కోట్లకు పైగా మాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్స్ (MBU) పూర్తయ్యాయి. 2025 సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా 1.56 లక్షలకు పైగా పాఠశాలలను కూడా కవర్ చేశారు.

MBU అంటే ఏంటి?
చిన్న పిల్లలకు ఆధార్ నమోదు చేసేటప్పుడు సాధారణంగా వారి పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాలతో పాటు ఫొటో తీసుకుంటారు. కానీ.. ఐదేళ్లలోపు పిల్లల వేలిముద్రలు, ఐరిస్ వివరాలను నమోదు చేయరు. పిల్లలు పెరిగే కొద్దీ వారి బయోమెట్రిక్ వివరాలను ఆధార్‌లో చేర్చాల్సి ఉంటుంది. దీనినే మాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్స్ అంటారు.

పిల్లలకు ప్రధానంగా రెండుసార్లు బయోమెట్రిక్ అప్‌డేట్ చేయాలి. మొదట 5 ఏళ్లు పూర్తయిన తర్వాత, రెండోసారి 15 ఏళ్లు పూర్తయిన తర్వాత అప్‌డేట్ చేయాలి. ఈ సమయంలో వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌తో పాటు లేటెస్ట్ ఫొటోను కూడా ఆధార్‌లో అప్‌డేట్ చేస్తారు.

పిల్లలకు ఉచితమేనా?
ప్రస్తుతం 5 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్‌పై ఫీజు మినహాయింపు ఉంది. 2026 సెప్టెంబర్ 30 వరకు వర్తించే నిబంధనల ప్రకారం ఈ అప్‌డేట్‌ను ఉచితంగా చేసుకోవచ్చు.

2025 అక్టోబర్ 1 నుంచి 7-15 ఏళ్ల పిల్లలకు MBU ఛార్జీలను ఒక సంవత్సరం పాటు యూఐడీఏఐ మాఫీ చేసింది. 5-7 ఏళ్లు, 15-17 ఏళ్ల పిల్లలకు కూడా MBU ఉచితంగానే కొనసాగుతోంది. కాబట్టి.. ప్రస్తుతం అర్హత ఉన్న పిల్లల తల్లిదండ్రులు బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం అదనంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.

అప్‌డేట్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయా?
పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేయకపోతే భవిష్యత్తులో కొన్ని సందర్భాల్లో అథెంటికేషన్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఉదాహరణకు ప్రభుత్వ పథకాలు, స్కాలర్‌షిప్‌లు, విద్యకు సంబంధించిన సేవలు, అలాగే NEET, JEE, CUET వంటి పరీక్షల సమయంలో ఆధార్ ఆధారిత గుర్తింపు అవసరం కావచ్చు. కేవైసీ వంటి ఇతర సేవల్లోనూ ఆధార్ అథెంటికేషన్ ఉపయోగిస్తారు. పిల్లలు పెరిగిన తర్వాత పాత బయోమెట్రిక్ వివరాలతో అథెంటికేషన్ చేయడంలో సమస్యలు రాకుండా ఉండేందుకు సరైన సమయంలో MBU చేయించడం మంచిది.

ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ ఎలా చేయాలి?
➤ఈ ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లో చేయలేరు. పిల్లలను తప్పనిసరిగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు తీసుకెళ్లాలి.

➤కాబట్టి.. ముందుగా సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని గుర్తించాలి. దీనికోసం భువన్ ఆధార్ పోర్టల్ ఉపయోగించవచ్చు. 

➤కేంద్రానికి వెళ్లేటప్పుడు పిల్లల ఆధార్ నెంబర్‌ను వెంట తీసుకెళ్లడం మంచిది. 

➤అక్కడ పిల్లల వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, ఫొటో తీసుకుంటారు.

అప్‌డేట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
బయోమెట్రిక్ అప్‌డేట్ చేసిన వెంటనే ఆధార్‌లో మార్పులు కనిపించకపోవచ్చు. సాధారణంగా కొన్ని వారాల సమయం పట్టవచ్చు. కాబట్టి.. యూఆర్ఎన్ నెంబర్ ఉపయోగించి యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: PF విత్‌డ్రా చేస్తే ట్యాక్స్ పడుతుందా?

Videos

అదిగో నా కోడలు.. వసంత కృష్ణ ప్రసాద్ ఆఫీస్ వద్ద.. సంచలన వీడియో బయటపెట్టిన జోగి రమేష్

ఎగసిపడుతున్న అలలు.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

భారీగా పెరిగిన బంగారం ధర

Watch Live: కొడుకు వివాదంపై జోగి రమేష్ సంచలన ప్రెస్ మీట్

కలిసొచ్చిన సెంటిమెంట్.. రవితేజ సక్సెస్ సీక్రెట్ ఇదే.!

నెల్లూరు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాల కలకలం

భగ్గుమన్న బియ్యం ధరలు.. చోద్యం చూస్తున్న బాబు సర్కార్

కాకినాడ రూరల్ PS కు సాధిక్ ఖాన్ తరలింపు

దొరికిన ఇద్దరు వీడియో.. ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్

లింగమనేని కొడుకు వీడియో తీసింది ఎవరంటే.. అది బయటపడటానికి కారణం కూడా..

Photos

+5

హీరోయిన్ కృతిసనన్ హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఇన్నాళ్లకు మళ్లీ ఓకే వేదికపై..(ఫోటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ హీరోయిన్‌ ప్రిషా సింగ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ కిర్రాక్ సీత వరలక్ష్మీ వ్రతం పూజలు.. (ఫోటోలు)

+5

నటి రాధిక బర్త్‌ డే సెలబ్రేషన్స్.. సీనియర్ హీరోయిన్ల సందడి (ఫోటోలు)

+5

టాక్సిక్ ఈవెంట్.. స్పెషల్ ‍అట్రాక్షన్‌గా కియారా అద్వానీ (ఫోటోలు)

+5

గిరిజన తండాల్లో యువతుల సందడే సందడి (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా మార్వాడీల 'కావడి యాత్ర' (ఫొటోలు)

+5

టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ఫోటోలు

+5

ఫ్రెండ్స్‌తో ఫుల్‌ జోష్‌లో ఆనంది..(ఫోటోలు)