Breaking News

ఎయిర్‌టెల్‌ లాభాల రింగ్‌

Published on Wed, 08/06/2025 - 04:01

న్యూఢిల్లీ: మొబైల్‌ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం 43 శాతం జంప్‌చేసి రూ. 5,948 కోట్లను తాకింది. భారత్‌సహా.. ఆఫ్రికా బిజి నెస్‌లో వృద్ధి ఇందుకు సహకరించింది.

గతేడాది (2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 4,160 కోట్లు ఆర్జించింది. ఆఫ్రికా కార్యకలాపాల నికర లాభం ఐదు రెట్లు ఎగసి 15.6 కోట్ల డాలర్లకు చేరింది. గత క్యూ1లో ఇది 3.1 కోట్ల డాలర్లు మా త్రమే. కాగా.. మొత్తం ఆ దాయం 28 శాతం పైగా పుంజుకుని రూ. 49,463 కోట్లయ్యింది. గత క్యూ1 లో రూ. 38,506 కోట్ల టర్నోవర్‌ అందుకుంది.  

దేశీ విభాగం జోరు 
మొత్తం ఆదాయంలో దేశీ బిజినెస్‌ 29 శాతం జంప్‌చేసి రూ. 37,585 కోట్లకు చేరింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ. 211 నుంచి రూ. 250కు బలపడింది. ఈ కాలంలో 40 లక్షలమంది స్మార్ట్‌ఫోన్‌ డేటా యూజర్లను జత చేసుకుంది. 2025 జూన్‌కల్లా మొత్తం కస్టమర్ల సంఖ్య 7% వృద్ధితో 60.5 కోట్లను తాకింది. దీనిలో దేశీ వినియోగదారుల వాటా 6.6 శాతం పుంజుకుని 43.6 కోట్లకు చేరింది.

పోస్ట్‌పెయిడ్‌ విభాగంలో 0.7 మిలియన్ల మంది జత కలవడంతో వీరి సంఖ్య 2.66 కోట్లకు చేరింది. స్మార్ట్‌ఫోన్‌ డేటా యూజర్ల సంఖ్యలో 8.2 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. దీంతో క్యూ1లో 2.13 కోట్లమంది వినియోగదారులు జత కలిశారు.  మొబైల్‌ డేటా వినియోగం సగటున 13 శాతం ఎగసి నెలకు 26.9 జీబీకి చేరింది. ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌సహా హోమ్‌ సర్విసుల విభాగం కస్టమర్ల సంఖ్య 38 శాతం జంప్‌చేసి 1.09 కోట్లను తాకింది.

ఈ కాలంలో పెట్టుబడి వ్యయాలు 14 శాతం తగ్గి రూ. 7,273 కోట్లకు పరిమితమయ్యాయి. కంపెనీ రుణ భారం 2 శాతం పెరిగి రూ. 1.91 లక్షల కోట్లకు చేరింది. భారతీ ఎయిర్‌టెల్‌లో భాగమైన ఎక్స్‌టెలిఫై కొత్తగా ఎయిర్‌టెల్‌ క్లౌడ్‌ పేరిట క్లౌడ్‌ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. ఇన్‌ఫ్రా, ప్లాట్‌ఫాం సర్వీసులను (ఐఏఏఎస్, పీఏఏఎస్‌) ఇది అందిస్తుంది.    

ఎయిర్‌టెల్‌ షేరు 0.8% బలపడి రూ. 1,930 వద్ద క్లోజైంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)