Breaking News

ఎయిర్‌టెల్‌ భారీ వ్యూహం.. టాటాగ్రూప్‌ కంపెనీపై కన్ను!

Published on Tue, 10/08/2024 - 21:05

ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన డిజిటల్ టెలివిజన్ విభాగాన్ని విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలోనే అతిపెద్ద డైరెక్ట్-టు-హోమ్ (డీటీహెచ్) సర్వీస్ ప్రొవైడర్ టాటా ప్లే (గతంలో టాటాస్కై)ని కొనుగోలు చేయాలని  యోచిస్తోంది. దీనికి సంబంధించి ఎయిర్‌టెల్‌ ప్రస్తుతం టాటా గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఎకనామిక్ టైమ్స్ కథనం పేర్కొంది.

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, ఎఫ్‌టీఏ సేవల ఆవిర్భావం కారణంగా వృద్ధి సమస్యలను ఎదుర్కొంటున్న డిజిటల్ టెలివిజన్ మార్కెట్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని ఎయిర్‌టెల్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా టాటాప్లేని కొనుగోలు చేయడానికి ఎయిర్‌టెల్‌ సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. 2017లో టాటా కన్స్యూమర్‌ మొబిలిటీ వ్యాపారాన్ని భారతీ ఎయిర్‌టెల్ కొనుగోలు చేసిన తర్వాత రెండు కంపెనీల మధ్య ఇది ​​రెండో ఒప్పందం కానుంది. ఈ ఒప్పదం కుదిరి టాటా ప్లేను ఎయిర్‌టెల్‌ కొనుగోలు చేస్తే టాటా తన కంటెంట్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యకలాపాల పూర్తిగా వైదొలుగుతుంది.

టాటా ప్లే ప్రస్తుతం డీటీహెచ్‌ విభాగంలో 20.77 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు, 32.7 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా ఉంది. కానీ ఆర్థిక పరంగా నష్టాల్లో నడుస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఏకీకృత నికర నష్టం రూ.353.8 కోట్లుగా ఉంది. టాటా ప్లే కొనుగోలుతో ఎయిర్‌టెల్‌ కస్టమర్‌ బేస్ పెరుగుతుందని, అదే సమయంలో జియో అందిస్తున్న ఆఫర్లతో పోటీపడే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ లావాదేవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)