Breaking News

ఎయిర్‌టెల్‌ లాభాల డేటా

Published on Wed, 08/05/2026 - 00:02

న్యూఢిల్లీ: మొబైల్‌ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 37 శాతం జంప్‌చేసి రూ. 8,167 కోట్లను తాకింది. భారత్‌సహా ఆఫ్రికా కార్యకలాపాలలో వృద్ధి ఇందుకు సహకరించింది. గతేడాది(2025–26) ఇదే కాలంలో రూ. 5,948 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 18 శాతం ఎగసి రూ. 58,539 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 49,463 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. మొత్తం కస్టమర్ల(సబ్‌్రస్కయిబర్లు) సంఖ్య 13 శాతం బలపడి 60.5 కోట్లను తాకింది. దీనిలో దేశీ వినియోగదారుల సంఖ్య సైతం 13 శాతం వృద్ధితో 43.6 కోట్లకు చేరింది. 

డేటా వినియోగం అప్‌ 
తాజా సమీక్షా కాలంలో ఎయిర్‌టెల్‌.. ఒక్కో వినియోగదారునిపై రూ. 264 చొప్పున సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) ఆర్జించింది. ఇది 6 శాతం అధికంకాగా, గతేడాది క్యూ1లో ఇది రూ. 250గా నమోదైంది. ఇందుకు మొబైల్‌ విభాగంలో ధరలు మెరుగుపడటం(ప్రీమియమైజేషన్‌)తోపాటు.. హోమ్స్, ఎయిర్‌టెల్‌ బిజినెస్‌ల వృద్ధి తోడ్పాటునిచ్చినట్లు కంపెనీ పేర్కొంది. క్యూ1లో మొత్తం 5 మిలియన్‌ కస్టమర్లను జత చేసుకున్నట్లు తెలియజేసింది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా పోస్ట్‌పెయిడ్‌ విభాగంలో 10 లక్షలమంది కస్టమర్లను జత చేసుకున్నట్లు కంపెనీ చైర్మన్‌ గోపాల్‌ విఠల్‌ వెల్లడించారు.

వెరసి పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారుల సంఖ్య 3 కోట్లకు చేరింది. దేశీయంగా డేటా సగటు వినియోగం 28 శాతం జంప్‌చేసి 34.4 జీబీని తాకింది. కన్సాలిడేటెడ్‌ పెట్టుబడి వ్యయాలు రూ. 13,386 కోట్లుకాగా.. దీనిలో దేశీ వాటా రూ. 9,698 కోట్లు. కంపెనీ నికర రుణ భారం 35 శాతం తగ్గి రూ. 81,852 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ షేరు స్వల్ప లాభంతో రూ. 1,957 వద్ద ముగిసింది. 

#

Tags : 1

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)