భారతీ ఎయిర్‌టెల్‌ బల్క్‌ డీల్‌.. రూ. 11,227 కోట్ల షేర్ల విక్రయం

Published on Sat, 08/09/2025 - 15:34

న్యూఢిల్లీ: మొబైల్‌ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ ప్రమోటర్‌ సంస్థలలో ఒకటైన ఇండియన్‌ కాంటినెంట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌(ఐసీఐఎల్‌) తాజాగా 0.98 శాతం వాటా విక్రయించింది. ఎన్‌ఎస్‌ఈ బల్క్‌డీల్‌ గణాంకాల ప్రకారం రెండు దశలలో 6 కోట్ల షేర్లు అమ్మివేసింది. ఒక్కో షేరుకి రూ. 1,870–1,872 ధరల శ్రేణిలో రూ. 11,227 కోట్లకు వాటా విక్రయించింది.

అయితే కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. తాజా లావాదేవీ తదుపరి ఎయిర్‌టెల్‌లో ఐసీఐఎల్‌ వాటా 2.47 శాతం నుంచి 1.49 శాతానికి తగ్గింది. వెరసి మొత్తం ప్రమోటర్ల వాటా 51.25 శాతం నుంచి 50.27 శాతానికి దిగివచ్చింది. ప్రమోటర్లలో భారతీ టెలికం అత్యధికంగా 40.47 శాతం వాటా కలిగి ఉంది. వాటా విక్రయం నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3.3 శాతం క్షీణించి రూ. 1,860 వద్ద ముగిసింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)