Breaking News

మలేరియా టీకా ధరలు తగ్గించిన భారత్‌ బయోటెక్‌!

Published on Wed, 06/25/2025 - 16:05

ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా టీకా ధరలను ఈ వ్యాధి ప్రబలంగా ఉండే కొన్ని దేశాల్లో సగానికి తగ్గిస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌, జీఎస్‌కేలు ప్రకటించాయి. ఆయా దేశాల్లో 2028 నుంచి మలేరియా నివారణ టీకాలు ఐదు డాలర్ల కంటే తక్కువ ధరకు లభిస్తాయని ఇరు సంస్థలు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపాయి. 

ప్రపంచవ్యాప్తంగా పేద దేశాలకు వ్యాక్సీన్లను పంపిణీ చేసేందుకు ఏర్పాటైన ‘ద వ్యాక్సీన్‌ అలయన్స్‌’కు 2026- 2030 మధ్య సరఫరా చేసే టీకాలపై ఒక ఒప్పందం కుదిరిన సందర్భంగా ఇరు సంస్థలు ఈ విషయాన్ని తెలిపాయి. జీఎస్‌కే, పాథ్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన మలేరియా టీకా ఆర్‌టీఎస్‌.ఎస్‌ను మలేరియా నివారణకు ఉపయోగించవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2021లోనే అనుమతులిచ్చింది. అయితే ఉత్పత్తి మార్గాల్లో మెరుగుదల, సామర్థ్యం పెంపు, లాభాన్ని కనీస స్థాయిలో ఉంచడం వంటి కారణాల వల్ల టీకా ధర సగానికి తగ్గించడం వీలైందని భారత్‌ బయోటెక్‌, జీఎస్‌కేలు వివరించాయి. 

‘‘వ్యాక్సీన్‌ అలయెన్స్‌కు టీకాల సరఫరా చేస్తామన్న ఒప్పందం కుదరడం వల్ల లక్షల మంది పిల్లలు, కుటుంబాలపై మలేరియా సమ​స్య తగ్గిపోతుంది. ఈ చర్య మాకు కేవలం వ్యాక్సీన్‌ అలయన్స్‌కు సహకరించడం మాత్రమే కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం’’ అని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా తెలిపారు. జీఎస్‌కే సహకారంతో ప్రపంచవ్యాప్తంగా మలేరియా బాధిత బాలలు, వారికి అందుబాటులో ఉన్న టీకాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తున్నాం అని చెప్పారు. న్‌​, పాథ్, ప్రపంచ ఆరోగ్య సంస్థల సహకారం కూడా ఉంది.’’ అని అన్నారు. 

కాగా, ఘన, కీన్యా, మలవాయి వంటి దేశాల్లో ఇటీవలే సుమారు ఇరవై లక్షల మంది పిల్లలకు మలేరియా టీకా ఇవ్వడం వల్ల ఈ వ్యాది కారణంగా మరణించే వారి సంఖ్య 13 శాతం వరకూ పడిపోయిందని, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య 22 శాతం తగ్గిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనం ద్వారా తెలిసింది. మలేరియా సమస్య ఎక్కువగా ఉన్న చోట్ల ఈ టీకాతోపాటు మలేరియా సీజన్‌లో తగిన మందులు ఇవ్వడం ద్వారా వ్యాధిని గణనీయంగా నివారించడం సాధ్యమైందని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.

(చదవండి: సిఈఓలు యవ్వనంగా ఉండాలంటే..! సుందర్‌ పిచాయ్‌కి కలిగిన సందేహం)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)