Breaking News

తస్మాత్‌ జాగ్రత్త!

Published on Sat, 10/12/2024 - 06:21

ముంబై: అక్రమ లావాదేవీలపై బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ)సహా తన నియంత్రణలో ఉన్న అన్ని సంస్థలూ ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశించింది. ఈ సమస్య అరికట్టడానికి సంబంధిత అంతర్గత, బాహ్య వనరుల నుండి పొందిన సమాచారాన్ని వినియోగించుకోవాలని సూచించింది. 

ఈ మేరకు సెంట్రల్‌ బ్యాంక్‌  ‘మనీ లాండరింగ్‌/టెర్రరిస్ట్‌ ఫైనాన్సింగ్‌ ఇంటర్నల్‌ రిస్క్‌ అసెస్‌మెంట్‌ గైడెన్స్‌’ను జారీ చేసింది. అక్రమ ధనార్జన, తీవ్రవాదులకు ఫైనాన్షింగ్‌ వంటి అంశాలు  వ్యవస్థలపై త్రీవ ప్రభావం చూపుతాయని, బ్యాంక్‌ సాధరణ ఖాతాదారులకు, దేశాలకు, భౌగోళిక ప్రాంతాలకు, ఉత్పత్తులకు, సేవలకు,  లావాదేవీలకు అలాగే డెలివరీ చానెళ్ల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగజేస్తాయని వివరించింది. 

ఈ నేపథ్యంలో ఈ సమస్యకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనడానికి నిరంతర నిఘా, కాలానుగుణమైన పర్యవేక్షణ అవసరమని సెంట్రల్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు మారుతున్న వ్యాపార పరిస్థితులు, బ్యాంకులు– తదితర నియంత్రిత సంస్థలు అందించే బ్యాంకింగ్, ఇతర ఆరి్థక ఉత్పత్తులలో పెరుగుతున్న సంక్లిష్టత స్థాయిలు, పోటీ పరిస్థితుల నేపథ్యంలో మనీలాండరింగ్, ఉగ్రవాద ఫైనాన్సింగ్‌ వంటి సవాళ్లు పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. అత్యాధునిక సాంకేతికత వినియోగం, చెల్లింపుల విధానాల్లో కొత్త పద్ధతులు వంటి అంశాలు సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయని పేర్కొంది. 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)