Breaking News

ఎక్కువ మైలేజ్ కోసం.. ఇవిగో బెస్ట్ సీఎన్‌జీ కార్లు

Published on Thu, 02/06/2025 - 17:46

ఇండియన్ మార్కెట్లో పెట్రోల్, ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే కాకుండా CNG కార్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఎందుకంటే సాధారణ పెట్రోల్ కారు కంటే సీఎన్‌జీ కారు కొంత ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు.. తమ వాహనాలను సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేస్తున్నాయి. ఈ కథనంలో రూ. 9 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే సీఎన్‌జీ కార్లను గురించి తెలుసుకుందాం.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ సీఎన్‌జీ (Maruti Suzuki Fronx CNG)
మార్కెట్లో లాంచ్ అయిన అతి తక్కువ కాలంలోనే.. కంపెనీ తన ఫ్రాంక్స్ కారును సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేసింది. చూడటానికి సాధారణ కారు మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ కనిపిస్తాయి. ఈ కారు ధర రూ. 8.46 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో 1197 సీసీ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఇది 28.51 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది.

టాటా పంచ్ సీఎన్‌జీ (Tata Punch CNG)
భారతదేశంలో అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటి, ఎక్కువ అమ్ముడైన మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్. ఇది మార్కెట్లో పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ రూపాల్లో అందుబాటులో ఉంది. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించిన ఈ టాటా పంచ్ సీఎన్‌జీ 26.99 కిమీ / కేజీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 7.23 లక్షలు (ఎక్స్-షోరూమ్). ధర అనేది ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్ సీఎన్‌జీ (Hyundai Exter S CNG)
రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో లభించే బెస్ట్ సీఎన్‌జీ కార్లలో.. హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్ సీఎన్‌జీ కూడా ఉంది. దీని ధర రూ. 8.43 లక్షలు. ఇది 27.1 కిమీ / కేజీ మైలేజ్ అందిస్తుంది. మార్కెట్లో ఈ కారు మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. మైలేజ్ సాధారణ మోడల్ కంటే కొంత ఎక్కువ.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)