Breaking News

సంపదలో మస్క్‌ను మించిన పెద్దాయన.. ప్రపంచ కుబేరుడిగా..

Published on Sun, 01/28/2024 - 13:54

ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఇప్పుడు రెండవ స్థానానికి చేరుకున్నారు. మొదటి స్థానంలో గ్లోబల్ లగ్జరీ గూడ్స్ బ్రాండ్ కంపెనీ ఎల్‌వీఎంహెచ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ అండ్ సీఈఓ 'బెర్నార్డ్ ఆర్నాల్ట్' (Bernard Arnault) నిలిచారు.

ఫోర్బ్స్ ప్రకారం.. బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం నికర విలువ శుక్రవారం నాడు 23.6 బిలియన్ డాలర్లు పెరిగి, మొత్తం సంపద 207.8 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఆర్నాల్డ్ అత్యంత సంపన్నమైన వ్యక్తిగా మస్క్‌ను మించిపోయాడు. మరోవైపు మస్క్ సంపద 204.5 బిలియన్ డాలర్లుగా ఉంది.

బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఇలాన్ మస్క్ మొదటి రెండు స్థానాల్లో నిలువగా.. జెఫ్ బెజోస్, లారీ ఎల్లిసన్, మార్క్ జుకర్‌బర్గ్‌లు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.

ఇలాన్ మస్క్ టెస్లా షేర్లు గత గురువారం ఏకంగా 13 శాతం పతనమవ్వడంతో.. 18 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైపోయింది. ఇదే సమయంలో ఆర్నాల్ట్ షేర్స్ బాగా పెరిగాయి. దీంతో మస్క్ ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి స్థానం కోల్పోవాల్సి వచ్చింది.

ఇదీ చదవండి: ఆ వ్యాఖ్యలే కొంప ముంచాయా! ఒకేరోజు రూ.6.64 లక్షల కోట్లు లాస్..

ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ 104.4 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో 11 వ స్థానం, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 75.7 బిలియన్ డాలర్ల సంపదతో 16వ స్థానం పొందినట్లు తెలుస్తోంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)