ఐటీ అన్నదమ్ములు.. భలే కట్టారు ఇల్లు!

Published on Mon, 02/09/2026 - 16:22

కొన్ని ఇళ్లు చూడగానే ఆకట్టుకుంటాయి. బెంగళూరులో ఇద్దరు ఐటీ ఇంజనీర్ సోదరులు నిర్మించిన ఈ అద్భుతమైన 4BHK ట్విన్‌ హోమ్‌ సింపుల్‌ స్టైల్‌, స్మార్ట్ డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. లోపల విశాలమైన గదులు, సహజ గాలి ప్రవాహం, ఆధునిక ఆలోచనలతో రూపొందిన ఈ ఇంటిని బిల్డ్ ఎ హోమ్ కన్స్ట్రక్షన్ అనే సంస్థ నిర్మించింది. ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగర్ శివరాయ్ ఈ ఇంటిని సందర్శించి, ఆ హౌస్ టూర్‌ను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఇంట్లో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న ప్రత్యేకతలేంటో మనమూ చూద్దామా...

రెండు ప్లాట్లు ఒకే ఇల్లు
30×40 పరిమాణంలోని రెండు ప్లాట్లను కలిపి, మొత్తం 2,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ట్విన్‌ హోమ్‌ను నిర్మించారు. తాము పక్కపక్కనే నివసిస్తూ ఒకే కుటుంబంగా ఉండాలనుకున్నామని అందుకే ఇల్లు ఇలా నిర్మించుకున్నట్లు చెప్పారు. బయట నుండి చూస్తే ఇది ఒకే ఆధునిక ఇంటిలా కనిపిస్తుంది. కానీ లోపలికి అడుగుపెడితే, అచ్చు ఒకేలా ఉండే రెండు పోర్షన్లు కనిపిస్తాయి. క్లీన్ డిజైన్, స్మార్ట్ లేఅవుట్, కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే ఆలోచనలే ఈ ఇంటి ప్రత్యేకత.

ఇంటి లోపలి అందం
డబుల్-హైట్ సీలింగ్‌తో ఉన్న లివింగ్ రూమ్ ఈ ఇంటికి హైలైట్. సహజ సూర్యకాంతి లోపలికి వెల్లువలా ప్రవహించేలా డిజైన్ చేయడం వల్ల, ఆ స్థలం మరింత విశాలంగా, ఆహ్వానకరంగా అనిపిస్తుంది. ఓపెన్-ప్లాన్ కిచెన్, పూజ గది, చిన్న ఆఫీస్-కమ్-బెడ్‌రూమ్, హాయిగా కూర్చునే బే విండోతో మాస్టర్ బెడ్‌రూమ్ ఈ ఇంటి సౌకర్యాన్ని పెంచుతాయి.

పిల్లల ప్రతి బెడ్‌రూమ్‌కు అటాచ్డ్ బాత్రూమ్, డ్రెస్సింగ్ ఏరియా ఉండటం గోప్యతను, సౌకర్యాన్ని అందిస్తుంది. రెండు ఇళ్లను కలిపే కనెక్టింగ్ హాల్వే ఒక వంతెనలా పనిచేస్తుంది. పై అంతస్తులో గెస్ట్ రూమ్, యుటిలిటీ ఏరియా ఉండటంతో, కుటుంబ సభ్యులతో పాటు అతిథులను కూడా సౌకర్యంగా ఆహ్వానించగలిగేలా ఇంటిని రూపొందించారు. యజమానులు ఈ ఇల్లు కేవలం అందంగా మాత్రమే కాకుండా, ఆచరణాత్మకంగా కూడా ఉండేలా జాగ్రత్తగా ప్లాన్‌ చేసి నిర్మించుకున్నట్లు తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)